అవును ఈ విషయంలో మాత్రం కేసీయార్ ను అందరు మెచ్చుకోవాల్సిందే. వయస్సుతో సంబంధంలేకుండా తెలంగాణాలో ఉన్న ప్రతిఒక్కరికీ కరోనా వ్యాక్సినేషన్ వేయించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో ఇఫ్పటివరకు 45-60 అని లేకపోతే 18-45 వయస్సులవారికి మాత్రమే కరోనా టీకాలని ప్రభుత్వాలంటున్నాయి. కానీ వయసుతో పనిలేకుండా అందరికీ టీకాలని చెప్పిన మొదటి ముఖ్యమంత్రి కేసీయార్ మాత్రమే.
కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ప్రస్తుతం యావత్ దేశాన్ని వణికించేస్తోంది. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళనే భేదం లేకుండా అందరిమీదా దాడిచేస్తోంది. కరోనా కారణంగా కొందరు, భయంతో మరికొందరు చనిపోతున్నారు. ఈ రెండు కారణాల కన్నా ఆక్సిజన్ కొరతతో మరణిస్తున్నవారు కూడా పెరిగిపోతున్నారు. చనిపోతున్న వాళ్ళల్లో చిన్న పిల్లలు, యువత కూడా ఉంటోంది. అందరికీ వ్యాక్సిన్ కార్యక్రమానికి తెలంగాణా ప్రభుత్వం రు. 2500 కోట్లు కేటాయిస్తున్నట్లు కేసీయార్ చెప్పటం సంతోషిచ్చదగ్గదే.
0-10 ఏళ్ళ వయస్సు పిల్లల్లో సుమారు 2.7 శాతంమందికి కరోనా వైరస్ సోకినట్లు లెక్కలు చెబుతున్నాయి. అలాగే 11-18 ఏళ్ళలోపు పిల్లల్లో 10 శాతం కరోనా బారినపడ్డారు. అంటే సెకెండ్ వేవ్ లో కరోనా మహమ్మరి పిల్లలను కూడా వదిలిపెట్టడంలేదు. ఈ కారణంగానే తల్లి, దండ్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది. బహుశా ఈ లెక్కలను చూసిన తర్వాతే కేసీయార్ అన్నీ వయసుల వారికి వ్యాక్సినేషన్ అనే నిర్ణయం తీసుకునుంటారు.
పిల్లలకు కూడా కరోనా సోకటం అన్నది ఒక్క తెలంగాణాలో మాత్రమే కాదు. దేశమంతా ఇదే పరిస్ధితి కనబడుతోంది. ఒకవైపేమో పిల్లల్లో కరోనా సోకకూడదని స్కూళ్ళను మూసేస్తున్నారు. ఇదే సమయంలో విద్యార్ధుల్లో కరోనా వైరస్ పెరిగిపోతోందని ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరలాంటపుడు వయసుతో పనిలేకుండా అందరికీ వ్యాక్సిన్ వేయాలని కేంద్రం ఎందుకు ఆలోచించటంలేదు.