గాంధీలో వారి కక్కుర్తితో అలాంటి దారుణ పరిస్థితి ఉందా?

Update: 2021-04-30 03:46 GMT
షాకింగ్ అంశం బయటకు వచ్చింది. కరోనా కారణంగా ఇప్పటికి విసురుతున్న సవాళ్లకు తోడు.. మనుషుల్లోని స్వార్థం.. మానవత్వాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్న తీరు షాకింగ్ గా మారింది. వివిధ ప్రభుత్వ.. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్సకు చేరటం.. అక్కడి వారు చేతులు ఎత్తేసే పరిస్థితితో ఆఖరి ఆశగా గాంధీ ఆసుపత్రికి తీసుకురావటం ఎక్కువగా కనిపిస్తుంది. వచ్చేవన్ని సీరియస్ కేసులు కావటంతో మరణాల నమోదు సాధారణం కంటే గాంధీలో ఎక్కువగా ఉండే పరిస్థితి. దీంతో.. రాష్ట్రంలో మరే ఆసుపత్రిలో లేనంత ఎక్కువ మరణాల్ని గాంధీ నమోదు చేస్తోంది.

ఇదిలా ఉంటే.. రోజురోజుకు పెరుగుతున్న మరణాల నేపథ్యంలో గాంధీలో డెడ్ బాడీలు పేరుకుపోతున్నాయి. వాటిని సకాలంలో అంత్యక్రియలు నిర్వహించలేని దుస్థితి. వేగవంతంగా అంత్యక్రియల్ని నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధఇకారులు చేయకపోవటం ఒక కారణమైతే.. కొందరి సిబ్బంది కక్కుర్తి.. శవాల మీద చిల్లర ఏరుకునే తత్త్వం కూడా తాజా దుస్థితికి కారణంగా చెప్పాలి.

డెడ్ బాడీ అంత్యక్రియలల కోసం రూ.25 నుంచి 30 వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో.. అంత ఖర్చు భరించలేని వారు ఆ మొత్తాన్ని సర్దుబాటు చేసుకోవటానికి నానా తిప్పలు పడుతున్నారు. మరోవైపు శవాల మీద వ్యాపారం చేసే కొందరి కారణంగా.. అంత్యక్రియలకు ఇవ్వాలంటే.. భారీఎత్తున డబ్బులు అడుతున్నారు. దీనికి తోడు.. డెడ్ బాడీని అప్పగించేందుకు ప్రస్తుతం ఉన్న ప్రొసీజర్ సరిగా లేకపోవటం కూడా ఒక కారణం.

ప్రస్తుతం గాంధీలో 300 వరకు డెడ్ బాడీలు పేరుకుపోయినట్లుగా చెబుతున్నారు. రోజుకు 40-50 వరకు మరణాలు చోటు చేసుకోవటం.. కొందరు తమ వారి డెడ్ బాడీలు తీసుకోవటానికి ముందకు రాకపోవటంతో ఇప్పుడు గాంధీ శవాగారం శవాల కుప్పగా మారిందని చెబుతున్నారు. ఈ పరిస్థితిని వీలైనంత త్వరగా సరి చేయాలని.. లేకుంటే మరిన్ని సమస్యలు ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News