తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొన్నిరోజులుగా శ్మశానాల్లో మృతదేహాలు వరుసగా కాలుతున్నాయి. అయితే కొవిడ్ మృతుల విషయంలో ప్రభుత్వ లెక్కలు, ఇతర గణాంకాలు సరి పోలడం లేదు. ఈ సమస్య కరోనా తొలి దశ నుంచి ఉంది. ప్రభుత్వం కావాలనే మరణాలను తక్కువగా చూపుతోందని కొందరు ఆరోపించారు. ఇక దహనవాటికల్లోనూ పరిస్థితి అలాగే ఉంది మరి!.
హైదరాబాద్లో అధికారికంగా కరోనా మృతులకు మూడు శ్మశాన వాటికల్లో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. బన్సీలాల్ పేట, ఈఎస్ఐ, అంబర్పేట కాగా మరికొన్ని ప్రాంతాల్లోనూ అనధికారికంగా అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. రోజూ పదుల సంఖ్యలో ఇక్కడ దహన సంస్కారాలు జరుగుతున్నాయని అక్కడ పనిచేసే సిబ్బంది చెబుతున్నారు. గతంలో కన్నా మూడింతల సంఖ్యలో మృతదేహాలు వస్తున్నాయని అంటున్నారు. తాము మునెప్పుడూ ఇలాంటి సంఘటనలు చూడలేదని అభిప్రాయపడ్డారు.
తమ ఆస్పత్రి నుంచి రోజూ 50కి మృతదేహాలను శ్మశానాలకు తరలిస్తున్నట్లు గాంధీ ఆస్పత్రిలో పనిచేసే సిబ్బంది వెల్లడించారు. ఏప్రిల్ 27న ప్రభుత్వ లెక్కల ప్రకారం 53 మంది మృతిచెందగా... ఒక్క ఈఎస్ఐ దహనవాటికలోనే 40 మందికి పైగా అంత్యక్రియలు నిర్వహించడం గమనార్హం. మిగతా వాటికలు, ఇతర మత సంబంధ ఖననాలు వీటికి అదనం. ఇలా ప్రభుత్వానికి, వాస్తవానికి గణాంకాల్లో పోలిక లేదు.
కరోనా పుణ్యామా అని అంత్యక్రియల ఖర్చు విపరీతంగా పెరిగింది. గతంలో మొత్తం రూ.పదివేలలో పూర్తి కాగా ఇప్పుడు రూ.25 వేల నుంచి 30 వేల వరకు ఖర్చవుతోందని బాధితులు వాపోతున్నారు. మృతదేహాలను తరలించే అంబులెన్సు, ఇతర వాహనాలకు డిమాండ్ పెరిగింది. దహన సంస్కారాల కోసం శ్మశానాల్లో స్లాట్ బుక్ చేసుకోవాల్సిన దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్లు చెప్పిన సమయానికి మృతదేహం తీసుకొస్తేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని చెబుతున్నారు. రాష్ట్రంలో కరోనా సృష్టించిన కల్లోలంతో మృతదేహాల విషయంలోనూ అనేక తేడాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.