అనుకున్నట్లే తెలంగాణలో లాక్ డౌన్ ను మరో పది రోజుల పాటు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. మజ్లిస్ అధినేత.. తన జానీజిగర్ అసద్ చేసిన సూచనను పక్కన పెట్టి మరీ లాక్ డౌన్ పొడిగింపుకే మొగ్గు చూపటం తెలిసిందే. దీంతో.. ఈసారికి లాక్ డౌన్ ఎత్తేస్తారని భావించిన కొందరు మాత్రం కేసీఆర్ సర్కరు తీసుకున్న నిర్ణయంతో నిరాశకు గురయ్యారు. ఇప్పటికే ఇరవై రోజుల నుంచి లాక్ డౌన్ లో ఉన్న రాష్ట్రంలో మరో పది రోజులు పొడిగించిన వైనం ఇబ్బందిగా మారింది. అయితే.. పాజిటివ్ రేట్ తగ్గేందుకు లాక్ డౌన్ సాయం చేసిందన్న అభిప్రాయంతో ప్రజలు ఉన్నారు.
మరి.. ఈసారి కూడా లాక్ డౌన్ ను పొడిగిస్తారా? మరెప్పుడు లాక్ డౌన్ ను ఎత్తేస్తారు? లాంటి ప్రశ్నలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి సందేహాలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు సీఎం కేసీఆర్. లాక్ డౌన్ పొడిగింపు ప్రకటన నేపథ్యంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఆయన లాక్ డౌన్ ఎత్తివేత ఎప్పుడున్న విషయంపై స్పష్టత ఇచ్చేశారు.
లాక్ డౌన్ కారణంగా పాజిటివ్ రేటు 29.5 శాతంగా ఉన్నది 9.5 శాతానికి తగ్గిందని..అది కాస్తా ఎప్పుడైతే 5 శాతానికి తగ్గుతుందో.. ఆ వెంటనే లాక్ డౌన్ ఎత్తేస్తామని ఆయన పేర్కొన్నారు. దీంతో.. లాక్ డౌన్ విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటమే కాదు.. అన్ని అంశాల్ని పరిగణలోకి తీసుకొని మాత్రమే నిర్ణయం తీసుకుందన్న భావన కలిగేలా చేస్తున్నారన్న భావన కలిగేలా చేస్తోంది. లాక్ డౌన్ ఎత్తివేతపై అదే పనిగా సందేహాలు వ్యక్తం చేసే వారందరికి స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారని చెప్పొచ్చు.