దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ జోరు కొనసాగుతోంది. సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుంది. అయితే , ఇప్పటికి కూడా లక్షల్లో కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు , వేల సంఖ్యలో కరోనా మరణాలు చోటు చేసుకుంటున్నాయి. దీనితో ఇంకా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. తెలంగాణ లో కూడా కరోనా మహమ్మారి కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ అమలులో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. లాక్ డౌన్ సడలింపు సమయం తర్వాత రహదారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి లాక్ డౌన్ ను పర్యవేక్షిస్తున్నారు.
ఏ ఒక్కరు అనవసరంగా బయటికి వచ్చిన వారిని అరెస్టులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతున్న వారిని, ఎన్టీఆర్ మినీ స్టేడియంలో వాలీబాల్ ఆడుతున్న యువకులను పట్టణ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు.అలాగే , ఆయా కాలనీల్లో షాపు యజమానులను సైతం స్టేషన్ కి తరలించి కేసులు నమోదు చేశారు. రోడ్లపై తిరుగున్న యువకులకు ఎక్కడ దొరికిన వారికి అక్కడే కరోనా టెస్టులు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని, లేకపోతే , వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్ లో యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎవరైనా మళ్లీ బయట కనిపిస్తే ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తామని హెచ్చరించారు.
ఇదిలా ఉంటే .. మన దేశంలో కరోన సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులతో పాటు మరణాలు కూడా తగ్గుతున్నాయి. ఐతే అంతలోనే థర్డ్ వేవ్ గురించి అంతటా ఆందోళన నెలకొంది. త్వరలోనే థర్డ్ వేవ్ వైరస్ వ్యాప్తి చెందుతుందని, పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ లో మన దేశంలోని చిన్నారులపై వైరస్ విరుచుకుపడే అవకాశముందని భావిస్తున్నారు. ఒక్క తెలంగాణలోనే దాదాపు 30 లక్షల మంది పిల్లలు వైరస్ సోకవచ్చని అంచనా వేస్తున్నట్లు ప్రముఖ మీడియా లో వార్తలు ప్రచారం అయ్యాయి. వీరిలో 8వేల మంది ఐసీయూలో చేరవచ్చని చెబుతున్నారు. అంతేకాదు 1 శాతం మంది పిల్లలకు మల్టీ సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ ముప్పుపొంచి ఉందన్న వార్తలు తల్లిదండ్రులను టెన్షన్ పెడుతున్నాయి.