తెలివి అంటే ధర్మాన దే.. లింగుమనే మాటను వెనక్కి తీసుకున్నాడు

Update: 2019-12-25 10:54 GMT
మాట అనటం సెకను పని. కానీ.. అనకూడని మాట అన్నాక.. అందులోని బయటకు రావటం.. ఎలాంటి విమర్శలు అంటించుకోకుండా బయటపడటం అంత తేలికైన విషయం కాదు. గతంలో అయితే ఉన్న నాలుగైదు మీడియా సంస్థలకు వ్యక్తిగతంగా ఫోన్ చేయటమో.. తనకున్న పలుకుబడిని కూసింత ఖర్చు పెడితే ఇష్యూ సెటిల్ అయిపోయేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదనే చెప్పాలి.

నోటి వెంట నుంచి వచ్చే చిన్న తప్పు మాటను సైతం అదే పనిగా చూపించే టీవీ చానళ్లు.. వెబ్ సైట్లు..యూట్యూబ్ వీడియోలు.. వీటన్నింటికి మించిన సోషల్ మీడియాతో ఆగమాగమయ్యే పరిస్థితి. అందుకే.. నోటి వెంట చిన్న మాట తేడా వస్తే చాలు.. దాన్ని సెట్ చేసుకోవటానికి కిందామీదా పడిపోవాల్సిందే. అయితే.. ఇలాంటి పరిస్థితుల్ని ఎంత సింఫుల్ గా డీల్ చేయాలో చేతల్లో చేసి చూపించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు.

ఒక సభలో మాట్లాడుతూ విశాఖ లో రాజధాని ఏర్పాటుపై అమరావతి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు.. నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇవన్నీ ఎడెనిమిది ఊళ్ల చేస్తున్న హడావుడి అని.. అది కూడా టీడీపీ కార్యకర్తల మాయగా అభివర్ణిస్తూ.. లింగులింగుమనే మాటను యథాలాపంగా వాడేశారు. ధర్మాన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. అమరావతి రైతుల్ని అంత చులకనగా మాట్లాడతారా? అంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి.

ఇలాంటివేళ.. ధర్మాన కు ఒకరి నుంచి వచ్చిన ఫోన్ కాల్ లో.. లింగులింగుమనే వ్యాఖ్యల పై ఒకరు అభ్యంతరం వ్యక్తం చేయటం.. ఆ వెంటనే విషయాన్ని మరింత పొడిగించకుండా సింపుల్ గా సారీ చెప్పేశారు. తన మాట తో ఏర్పడిన వివాదానికి పుల్ స్టాప్ పెట్టేశారు. తానన్న మాటను వెనక్కి తీసుకుంటున్నానని.. క్షమించాలని చెప్పిన ధర్మాన.. అమరావతి వచ్చినప్పుడు కలుద్దామన్న తీరు చూస్తే.. ఇష్యూను క్లోజ్ చేసేలా ఆయన తీరు ఉందని చెప్పాలి. నోరు జారి మాట అనటమే కాదు.. టైమ్లీగా దాన్ని క్లోజ్ చేసిన ధర్మాన తీరు బాగుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


Tags:    

Similar News