ఇది దాసరి కిరణ్ పూర్వజన్మ సుకృతం

Update: 2023-02-01 09:00 GMT
''తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నియమితులు కావడం పూర్వజన్మ సుకృతం. అలాంటి పవిత్రమైన భాద్యాత స్వీకరించిన కిరణ్ కి అభినందనలు'' తెలిపారు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నియమితుమైన దాసరి కిరణ్ కుమార్ కి ఆత్మీయ సన్మాన కార్యక్రమం తెనాలిలో జరిగింది. ఈ కార్యక్రమంలో మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ.. పవిత్రమైన భాద్యాత స్వీకరించిన కిరణ్ కి అభినందనలు. కిరణ్ కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. దేవుడి కరుణా కటాక్షాలతోటి కిరణ్ అన్ని రంగాల్లో అభివృద్ది చెందాలి'' అన్నారు  

ఎంపి నందిగామ సురేశ్‌ మాట్లాడుతూ.. దేవునికి సేవ చేయడానికి జగన్ అన్న ఇచ్చిన అవకాశం చాలా గొప్పది. ఎన్నో పుణ్యాలు చేస్తే ఆ అవకాశం వచ్చింది. కిరణ్ గారికి వున్న  మంచితనం, సేవా గుణం వలనె ఇంత గొప్ప అవకాశం వచ్చింది. రానున్న రోజుల్లో మరిన్ని వున్నత శిఖరాలని అవరోధించాలి'' అన్నారు. మంత్రి మేరుగు నాగార్జున, , బాపట్ల ఎంపి నందిగామ సురేశ్‌, సినీ  దర్శకులు బాబి కొల్లి, త్రినాధరావు, మిత్రులు, అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Similar News