తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ+జనసేన అభ్యర్ధిగా రిటైర్డ్ ఐఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పోటీ చేయబోతున్నారా ? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమైతే నిజమే అనుకోవాలి. ఉపఎన్నికలో ఎవరి పార్టీ అభర్ధి పోటీ చేయాలనే విషయంలో రెండు పార్టీలతో ఓ జాయింట్ కమిటిని వేయబోతున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చెప్పినట్లు పవన్ కల్యాణ్ చెప్పిన విషయం తెలిసిందే.
నడ్డా చెప్పినట్లు పవన్ చెప్పారే కానీ కమిటి ఎప్పుడు వేస్తారు ? కమిటిలో సభ్యులుగా ఎవరుంటారు ? అనే విషయాలేవీ ఫైనల్ కాలేదు. సరే విషయం ఏదైనా అభ్యర్ధి ఎంపికలో బీజేపీదే అప్పర్ హ్యాండ్ అయ్యే అవకాశాలు ఎక్కువున్నాయి. ఉపఎన్నికలో పోటీ విషయంలో దాసరి పేరు ఎలా పిక్చర్లోకి వచ్చిందో కూడా ఎవరు చెప్పలేకపోతున్నారు. మొత్తానికి దాసరి బీజేపీ క్యాండిడేటే అని కొందరు, కాదు జనసేన అభ్యర్ధి అని మరికొందరు చెప్పుకుంటున్నారు.
తెలుగుదేశంపార్టీ తరపున పనబాక లక్ష్మిని పోటీ చేయించబోతున్నట్లు సుమారు 10 రోజుల క్రితమే చంద్రబాబునాయుడు ప్రకటించేసిన విషయం తెలిసిందే. అలాగే అధికార వైసీపీ తరపున ఫిజియో థెరపిస్టు డాక్టర్ గురుమూర్తి అభ్యర్ధిత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసినట్లు ప్రచారం తెలిసిందే. అయితే అధికారికంగా ప్రకటించలేదు. వైసీపీ ఎంపిగా ఉన్న బల్లి దుర్గాప్రసాదరావు చనిపోవటంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. అలాంటది ఆయన కుటుంబంలోని వాళ్ళకు కాకుండా ఇతరులను పోటిలోకి దింపటంపైనే జగన్ దృష్టి పెట్టారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.