దత్తాత్రేయకు రిటైర్మెంట్? ఆయనకు టికెట్!

Update: 2019-03-15 10:57 GMT
చాన్నాళ్ల కిందటే దత్తాత్రేయను కేంద్రమంత్రి వర్గం నుంచి తప్పించిన బీజేపీ అధిష్టానం.. ఇప్పుడు ఆయనకు ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ను ఇవ్వాలని భావిస్తోందట. సికంద్రాబాద్ నుంచి ఈ సారి దత్తాత్రేయకు అవకాశం ఉండదని, ఆయన స్థానంలో కిషన్ రెడ్డి ఎంపీగా అక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి.

ఇటీవలే కిషన్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తను వరసగా నెగ్గిన అంబర్ పేట నుంచిని కిషన్ ఓటమి పాలయ్యారు. అలాంటి కిషన్ రెడ్డికి ఏకంగా ఎంపీ టికెట్ ఇస్తారా? అనేది కూడా ఆసక్తిదాయకమైన విషయమే.

తను మళ్లీ పోటీ చేయాలని దత్తాత్రేయ అనుకుంటున్నారట. అయితే అధిష్టానం మాత్రం అందుకు సానుకూలంగా లేదని టాక్. దత్తాత్రేయకు వయసు మీద పడిన నేపథ్యంలో ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నిలపాలని అమిత్ షా లెవల్లో అనుకుంటున్నారట.

అయితే సికింద్రాబాద్ ఎంపీ సీటుకు కిషన్ రెడ్డి పూర్తిగా స్థానికేతరుడు కావడం, ఆయన ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయి ఉండటంతో… ఆయనకు టికెట్ దక్కదని - తనకే అవకాశం లభిస్తుందని దత్తాత్రేయ  భావిస్తున్నారట. ఇవి తన సానుకూల పాయింట్లుగా భావిస్తున్నారట ఆయన.

మరి ఈ వ్యవహారాన్ని బీజేపీ అధిష్టానం ఎలా సెటిల్ చేస్తుందనేది ఆసక్తిదాయకమైన అంశమే. దత్తాత్రేయకే మళ్లీ ప్రాధాన్యతను ఇస్తుందా లేక కిషన్ కు టికెట్ ఖరారు చేస్తుందా? చూడాలిక!


Tags:    

Similar News