అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగుతున్నట్టు బుధవారం అధికారికంగా ప్రకటించాడు. అంతేకాదు.. వైట్ హౌస్ బిడ్ కోసం 76 ఏళ్ల వయసునున్న ట్రంప్ పత్రాలను సైతం దాఖలు చేసినట్టు తెలుస్తోంది. తద్వారా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న తొలి ప్రధాన అభ్యర్థిగా ట్రంప్ నిలిచారు.
ఇప్పటి నుంచే ఎన్నికల్లో విజయం కోసం ప్రణాళికతో ముందుకెళ్లాలని ట్రంప్ యోచిస్తున్నారు. ట్రంప్ పేరు చెప్పగానే అతడి కుమార్తె ఇవాంకా ట్రంప్ పేరు వినిపిస్తుంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో ఇవాంక కీలక పాత్ర పోషించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేశారు. పలు దేశాల్లో అధికారిక హోదాల్లో పర్యటించారు. ఇండియాలోని తెలంగాణలో కూడా పర్యటించారు.
ట్రంప్ మళ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నట్టు ప్రకటించగా.. ఇవాంక ట్రంప్ మాత్రం నేను రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపింది. 2024లో వైట్ హౌస్ ను తిరిగి కైవసం చేసుకునేందుకు తన తండ్రి చేస్తున్న ప్రయత్నంలో నేను భాగస్వామిని కాదని.. తన తండ్రి ప్రచారంలో అసలు జోక్యం చేసుకోనని స్పష్టం చేసింది. నా పిల్లల సంరక్షణ, కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నానని ఇవాంకా తెలిపింది. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని తెలిపింది.
2024 అధ్యక్ష బరిలో నిలిచేందుకు ఫ్లోరిడాలో నామినేషన్ కోసం బిడ్ ను ట్రంప్ ప్రారంభించారు. అతడి భార్య మెలానియా, కుమారుడు ఎరిక్, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇవాంక భర్త కూడా ఇందులో ఉన్నారు.
బిజినెస్ మ్యాన్ అయిన డొనాల్డ్ ట్రంప్ 2016 అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా గెలిచారు. అమెరికన్స్ ఫస్ట్ అంటూ రెచ్చగొట్టి మరీ ఓటర్లను ఆకర్షించి అమెరికా అధ్యక్షుడయ్యాడు. 2020 ఎన్నికల్లో మాత్రం జోబైడెన్ చేతుల్లో ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పటికీ ట్రంప్ నకు ఉన్న ఫాలోయింగ్ తగ్గలేదు. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.