అమ‌రావ‌తికి అండ‌గా మ‌రో ధ‌నిక దేశం

Update: 2015-11-13 05:01 GMT
నవ్యాంధ్ర ప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి త‌మ స‌హాయ - స‌హ‌కారాలు అందించేందుకు ప్ర‌పంచ దేశాలు ముందుకువ‌స్తున్నాయి. అమ‌రావ‌తిలో భాగ‌స్వామ్యం అయ్యేందుకు సింగ‌పూర్‌ - జ‌పాన్‌ లు ఇప్ప‌టికే ముందుకు రావ‌డ‌మే కాకుండా త‌మ క్రియాశీల భాగ‌స్వామ్యాన్ని అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మ‌రో దిగ్గ‌జ దేశం ముందుకు వ‌చ్చింది. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ వ‌ల్ల ఆ ప్ర‌య‌త్నం విజ‌య‌వంతం అయింది.

అమ‌రావ‌తి నిర్మాణానికి బ్రిటన్‌ సహాయం అందజేయనుంది. ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్‌ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని డేవిడ్‌ కామెరూన్‌ ఈ మేరకు ప్రకటించారు. భారత్‌ లోని అమరావతితో పాటు ఇండోర్‌ - పుణే అభివృద్ధికి ఐదేళ్ల కాలంలో సహాయం అందించనున్నట్లు తెలిపారు. భార‌త ప్ర‌భుత్వం త‌మ‌కు అందించిన ప్ర‌తిపాద‌న‌ల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వివరించారు.

మొత్తంగా అమ‌రావ‌తి అండ‌గా ఉత్ప‌త్తి రంగంలో నంబ‌ర్ వ‌న్‌ గా నిలిచి ప్ర‌స్తుతం సేవ‌ల  రంగంలో దూసుకువెళ్తున్న బ్రిట‌న్ ముందుకు రావ‌డం విశేష‌మే కాదు... అమ‌రావ‌తి కీర్తిప‌తాక‌ను ఎగుర‌వేసే అంశం కూడా.
Tags:    

Similar News