చేయని నేరానికి శిక్ష అనుభవించటం మామూలు విషయం కాదు. అందునా.. యావజ్జీవ కారాగార శిక్ష అంటే మాటలుకాదు. ఇలాంటి సిత్రమైన పరిస్థితిని మనోధైర్యంతో ఎదుర్కోవటమే కాదు.. వ్యవస్థల మీద పోరాడిన అతడు ఎట్టకేలకు తాను నిర్దోషినన్న విషయాన్ని కోర్టు ఒప్పుకోవటమే కాదు.. విడుదల చేసే వరకూ పోరాడుతూనే ఉన్నాడు. ఈ సిత్రమైన ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. తన విలువైన జీవితాన్ని తప్పుడు ఆరోపణలతో జైలు పాలు చేసిన తీరుపై వ్యవస్థ మీద కేసు వేసి.. భారీ పరిహారం పొందటానికి అర్హత పొందాడో వ్యక్తి అదెలా అంటే.
ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ ఈస్ట్ మెన్ ఒక ఆర్థికవేత్త. 1989లో సబర్బన్ కాన్ బెర్రాలో ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ ఆపీసర్ కొలిన్ వించెస్టర్ కారు దిగుతుండగా కాల్పులకు గురై చనిపోయాడు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మారారు డేవిడ్. అతన్ని పోలీసులు అరెస్ట చేశారు. తాను ఎలాంటి హత్య చేయలేదని వాదించాడు. తప్పు చేయలేదు మొర్రో అన్నా.. అతని మాటను వినిపించుకోలేదు. హత్య కేసులో అతడ్ని దోషిగా నిర్ణయించిన కోర్టు అతడికి యావజ్జీవ కారాగార శిక్ష వేసింది.
అయినప్పటికీ తాను ఎలాంటి తప్పు లేదంటూ అప్పీలు చేసుకున్న ఆతడి ఆక్రోశం నిజమన్న విషయాన్ని కోర్టు నిర్దారించి అతన్నినిర్దోషిగా తేల్చిన సుప్రీంకోర్టు 2004లో అతన్ని విడుదల చేసింది. కానీ.. అప్పటికే 19 ఏళ్ల పుణ్యకాలం గడిచిపోయింది. నిర్దోషిగా బయటకు వచ్చిన అతను.. తనకు జరిగిన అన్యాయం మీద న్యాయపోరాటాన్ని షురూ చేశారు. తప్పుడు కేసులో చేయని నేరానికి పందొమ్మిదేళ్ల జీవితాన్ని నాశనం చేసినందుకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ కోర్టు కేసు వేశారు.
ఇరు వర్గాల వాదన విన్న కోర్టు అతనికి రూ.33 కోట్ల పరిహారాన్ని చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు వాదనల సందర్భంగా తనకు జరిగిన అన్యాయం గురించి ఏకరువు పెట్టాడు. తనను దోషిగా నిర్దారించి జైలు పాలు చేసిన క్రమంలో తనకు కుటుంబమే లేకుండా పోయిందని.. తాను జైల్లో ఉన్నప్పుడు తల్లి.. సోదరి చనిపోయారన్నారు. 2006లో తన తోటి ఖైదీ దాడి చేయటంతో ఒక కన్నుకు గాయమై.. కనిపించటం లేదన్న అతను.. తనకు జరిగిన అన్యాయానికి పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలన్నారు. ఈ వాదనతో కోర్టు అతనికి రూ.33 కోట్లు ఇవ్వాలని పేర్కొంది. మరి.. ప్రభుత్వం కడుతుందా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఈ కేసు కోసం అక్కడి ప్రభుత్వం రూ.144 కోట్లను ఖర్చు చేసింది. కేసు అప్పీలుకు వెళితే.. మరికొంతకాలం బాధితుడికి అందాల్సిన పరిహారం ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు.