మైదానంలోనే కాదు పడకగదిలోనూ వార్నర్ సమర్థుడే

Update: 2020-11-11 17:40 GMT
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆటగాడు డేవిడ్ వార్నర్ తన విధ్వంసకర బ్యాటింగ్ కు పెట్టింది పేరు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ సారథిగానూ వార్నర్ ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సందర్భంగా తెలుగువారి మనసు దోచుకునేందుకు భార్య క్యాండిస్, పిల్లలతో కలిసి వార్నర్ టాలీవుడ్ స్టార్ల పాటలకు టిక్ టాక్ లో స్టెప్పులేసి అదరగొట్టాడు. తాజాగా జరిగిన ఐపీఎల్ -2020లో సన్ రైజర్స్ ఎలిమినేట్ అయినప్పటికీ....548 పరుగులు చేసిన వార్నర్ కెప్టెన్ గా తనవంతు పాత్ర పోషించాడు. కుటుంబాన్ని అమితంగా ప్రేమించే వార్నర్....నవంబరు 27న స్వదేశంలో భారత్ తో జరగనున్న సిరీస్ కోసం బయోబబుల్ లో సిద్ధమవుతున్నాడు. దీంతో, మరి కొద్ది రోజులు తన ముగ్గురు పిల్లలను, భార్యను వార్నర్ మిస్ కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో వార్నర్ గురించిన ఆసక్తికర విషయాన్ని అతడి భార్య క్యాండిస్ వెల్లడించింది. తాజాగా ఓ రేడియో షోలో పాల్గొన్న క్యాండిస్ తన వైవాహిక, లైంగిక జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కొన్ని సార్లు మ్యాచ్ కు ముందు వార్నర్ తనతో సెక్స్ చేస్తాడని క్యాండిస్ చేసిన బోల్డ్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

‘ది కైల్ అండ్ జాకీ ఓ' షో‌లో పాల్గొన్న క్యాండిస్ ను హోస్ట్ కిస్ కైల్ ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ఫుట్ బాల్ ప్లేయర్లు మ్యాచ్‌కు ముందు సెక్స్ చేయరని, మ్యాచ్ కు ముందు వార్నర్ కూడా అంతేనా? అని క్యాండిస్ ను కైల్ ప్రశ్నించాడు. మ్యాచ్ కు ముందు సెక్స్ చేయాలా వద్దా అన్నది వార్నర్ ఇష్టంపై ఆధారపడి ఉంటుందని, చేయకూడదన్న నిబంధన ఏమీ లేదని చెప్పుకొచ్చింది. దాంతోపాటు, పడక సుఖంలో తన భర్త సమర్థుడని సర్టిఫికెట్ కూడా ఇచ్చేసింది క్యాండిస్. మ్యాచ్ డే వరకు సెక్స్ చేయడానికి వార్నర్ సిద్దమైతే...భార్యగా అతడికి కావాల్సింది చేస్తానని చెప్పింది క్యాండిస్. వార్నర్ కు అన్ని విధాలుగా అండగా ఉన్నందునే వారి వివాహ బంధం గట్టిగా ఉందని కైల్ ప్రశంసించాడు. మైదానంలోనే కాదు పడకగదిలోనూ వార్నర్ సమర్థుడేనని క్యాండిస్ చేసిన బోల్డ్ కామెంట్లపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Tags:    

Similar News