బౌలర్ రనప్ తీసుకోవడం.. బంతిని విసరడం.. బ్యాట్స్ మన్ వికెట్ ఇచ్చేసుకోవడం.. ఇదీ క్రికెట్ లో జరిగే సహజ ప్రకియే కదా అంటారా? కానీ.. ఇక్కడే ఉంది ఓ మలుపు. ఒకే బౌలర్ ఒకే బ్యాట్స్ మన్ ను పగబట్టినట్టుగా పదేపదే ఔట్ చేస్తే అదే విధి విచిత్రం. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ లో ఈ సీన్ రిపీట్ అవుతోంది. చూడబోతుంటే రికార్డు కూడా బద్ధలయ్యేలా ఉంది.
సిక్సు సిక్సుల బ్రాడ్.. సన్ రైజర్స్ వార్నర్
ఇంగ్లాండ్ పేస్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ గురించి కొత్తగా చెప్పదేముంది. క్రికెట్ కుటుంబం నుంచి వచ్చిన అతడు 600 వికెట్లకు అతి సమీపంలో ఉన్నాడు. అరుదైన ఫీట్ ను అందుకునేందుకు అతడికి ఇంకా అవకాశాలున్నాయి. అయితే, బ్రాడ్ భారత అభిమానులకు మరింత సుపరిచితుడు. 2007 టి20 ప్రపంచ కప్ లో టీమిండియా డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ చేతిలో ఓకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టించుకున్న చెత్త రికార్డు బ్రాడ్ ది.
కానీ, ఆ తర్వాత బ్రాడ్ చాలా మారాడు. వన్డేలు, టి20లు మానేసి దశాబ్ద కాలంగా టెస్టులపైనే ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు ప్రపంచంలో 600 వికెట్లు తీసిన బౌలర్ గా గొప్ప రికార్డుకు చేరువగా ఉన్నాడు. ఇక అతడి చేతిలో బలవుతున్న బ్యాట్స్ మన్ డేవిడ్ వార్నర్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వార్నర్ అందరికీ సుపరిచితుడే. అసలు ఐపీఎల్ లో వార్నర్ అంటే పెద్ద పేరు. ఆస్ట్రేలియా ఓపెనర్ గానూ వందపైగా టెస్టులు ఆడిన వార్నర్ ఆ దేశ మేటి క్రికెటర్లలో ఒకడు.
17 సార్లు.. టు బి కంటిన్యూడ్
వార్నర్ ను స్టువర్ట్ బ్రాడ్ టెస్టుల్లో ఇప్పటివరకు 17 సార్లు ఔట్ చేశాడు. ప్రస్తుతుం హెడింగ్లేలో జరుగుతున్న టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ ఒకే విధంగా పెవిలియన్ కు పంపాడు. మరో రెండు టెస్టులు జరగాల్సి ఉన్న నేపథ్యంలో వార్నర్ ను బ్రాడ్ కనీసం రెండు సార్లయినా ఔట్ చేసే చాన్సుంది.
కాగా, టెస్టుల్లో ఇప్పటివరకు ఆసీస్ పేసర్ మెక్ గ్రాత్ ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ కీత్ అథర్టన్ 19 సార్లు ఔట్ చేయడం రికార్డుగా ఉంది. పాత తరంలో ఇంగ్లండ్ బౌలర్ బెడ్సర్ 18 సార్లు ఆసీస్ బ్యాట్స్ మన్ ఏఆర్ మోరిస్ ను ఔట్ చేశాడు. దీని తర్వాత రికార్డు విండీస్ భీకర పేసర్లు కర్ట్ లీ అంబ్రోస్, కోట్నీ వాల్ష్ లదే. వీరిద్దరూ ఒకే బ్యాట్స్ మన్ ను 17 సార్లు బలిగొన్నారు.
అయితే, ఆ బ్యాట్స్ మన్ ఎవరో కాదు.. మైక్ అథర్టనే. అంటే.. అథర్టన్ మొత్తం కెరీర్ లో 53 సార్లు మెక్ గ్రాత్, అంబ్రోస్, వాల్ష్ లకు వికెట్ ఇచ్చాడన్నమాట. ఇదీ ఓ రికార్డే.