కరోనా వైరస్ తీవ్రత దేశంలో రోజురోజుకు విస్తరిస్తున్న వేళ రోగులకు ఉపశమనం కలిగించే మరో మందు అందుబాటులోకి వచ్చింది. దీని చికిత్సలో వినియోగించేందుకు మరో ఔషధానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది.
చర్మ వ్యాధి అయిన సొరియాసిస్ ను నయం చేయడానికి ఉపయోగించే ‘ఇటోలిజుమాబ్’ ఇంజెక్షన్ ను కరోనా రోగులకు వాడేందుకు అంగీకరించింది. అయితే ఇది తీవ్రస్థాయి కరోనా లక్షణాలతో బాధపడుతున్న వాళ్లు అత్యవసర సమయాల్లోనే వాడాలని పేర్కొంది.
ఈ ఇంజెక్షన్ పవర్ ఫుల్ కాబట్టి తీసుకోవాలనే బాధితులు రాతపూర్వకంగా అంగీకారం తెలుపాల్సి ఉంటుందని డీసీజీఐ పేర్కొంది. ఈ మందు కరోనాను క్లిష్ట సమయంలో వాడి ఉపశమనం పొందవచ్చని సూచించింది.
ఇప్పటికే ‘రెమెడిసివిర్’ అనే అంటీ వైరల్ ఇంజెక్షన్ దేశంలో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ ‘ఇటోలిజుమాబ్’ కూడా రోగులకు స్వాంతన చేకూర్చనుంది.