నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే కంగనా.. మరోసారి అవే తరహా వ్యాఖ్యలు చేసింది. ఇటీవల గంగానదిలోని మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొని వచ్చిన సంగతి తెలిసిందే. అవి కొవిడ్ బాధితుల మృతదేహాలేనని అధికారులు గుర్తించినట్టు కూడా వార్తలు వచ్చాయి. అయితే.. ఆ మృతదేహాలు కొట్టుకొచ్చింది గంగానదిలో కాదని, అసలు ఇండియాలోనే కాదని చెప్పుకొచ్చింది కంగనా.
ఆ మృతదేహాలు నైజీరియా దేశానికి చెందినవని చెప్పుకొచ్చిందీ నటీమణి. ఈ మేరకు తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్లో పోస్టు చేసింది. దీనికి ఓ వీడియోను కూడా జత చేసింది. ఈ పోస్టుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. నీ అబద్దాలకు అంతే లేదా కంగానా? అని మండిపడ్డారు. దేశంలో పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా కూడా.. పద్ధతి మారదా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు విమర్శల దాడి కొనసాగిస్తున్న నెటిజన్లు.. కంగనాపై ట్రోలింగ్ చేస్తున్నారు. కాగా.. అసత్యాలు ప్రచారం చేస్తోందని, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ట్విటర్ సంస్థ కంగనా అకౌంట్ ను శాశ్వతంగా బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో.. ఇన్ స్టా గ్రామ్ లో తన పోస్టులు పెడుతోంది కంగనా.