ఐటీ ఉద్యోగిని హత్యకేసులో సంచలన తీర్పు!

Update: 2016-08-22 08:22 GMT
ఐటీ ఉద్యోగిని జిగిషా ఘోష్ హ‌త్య కేసు 2009లో దేశ‌వ్యాప్తంగా సంచ‌నం అయిన సంగ‌తి తెలిసిందే. దేశ రాజ‌ధాని ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ హ‌త్య అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశం అయింది. ఈ కేసులో దోషులుగా ఉన్న ముగ్గురు నిందితుల‌కు ఢిల్లీ అడిష‌న‌ల్ సెష‌న్స్ కోర్టు సోమ‌వారం శిక్ష ఖ‌రారు చేసింది. నిందితుల‌లో ఒక‌రికి యావ‌జ్జీవ కారాగారం - మిగ‌తా ఇద్ద‌రికీ ఉరిశిక్ష విధిస్తూ ధ‌ర్మాసం తీర్పు వెలువ‌రించింది. నిందితులు ర‌వి క‌పూర్‌ - అమిత్ శుక్లాల‌కు ఉరిశిక్ష విధించారు. బ‌ల్దీమాలిక్‌ కు జీవిత ఖైదు ఖ‌రారు చేశారు.

హెవిట్ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు జిగిషా ఘోష్‌. ఎక్కువ‌గా నైట్ షిఫ్ట్‌ ల‌లో ప‌నిచేసే జిగిషా ప్ర‌తీ రోజూ తెల్ల‌వారు జామున కంపెనీ పంపించే క్యాబ్ లో ఇంటికి చేరుకుంటూ ఉండేవారు. అలానే, 2009 మార్చి 18 వేకువ జామున‌ 4 గంట‌ల‌కు కంపెనీలో క్యాబ్‌ లో ఇంటికి వ‌చ్చారు. అలా వ‌సంత్ విహార్ చేరుకున్న జిగిషా త‌రువాత ఏమ‌య్యారో అనేది మిస్ట‌రీగా మారిపోయింది. తొలుత దీన్ని ఒక అప‌హ‌ర‌ణ కేసుగా పోలీసులు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు. అయితే, సూర‌జ్ కుండ్ ప్రాంతంలో ఒక మురికి కాలువ‌లో జిగిషా మృత‌దేహమై క‌నిపించారు. దీంతో ఢిల్లీ వాసులంతా ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు.

ఆ త‌రువాత, ముగ్గురు దోషుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురే జిగిషాను అప‌హ‌రించి హ‌త్య చేశార‌ని పోలీసు ద‌ర్యాప్తులో తేలింది. ఆమెను చంపేందుకు ఉప‌యోగించిన వెప‌న్ పోలీసుల‌కు దొర‌క‌డంతో.. మొత్తం మిస్ట‌రీ వీడిపోయింది. జిగిషాను అప‌హ‌రించి, ఆమె ద‌గ్గ‌ర ఉన్న న‌గ‌లు - ఖ‌రీదైన బూట్లు - చేతి గ‌డియారంతోపాటు ఆమె ప‌ర్సులో ఉన్న క్రెడిట్ కార్డుల‌ను కూడా లాక్కున్నార‌ని అధికారులు వెల్ల‌డించారు. వ‌స్తువుల్ని స‌మీపంలోని స‌రోజినీ న‌గ‌ర్ మార్కెట్ లో చౌక‌గా విక్ర‌యించేసి సొమ్ము చేసుకున్నార‌ని తేలింది. జులై 14వ తేదీన అద‌న‌పు సెష‌న్స్ న్యాయమూర్తి సందీప్ యాద‌వ్  ఈ ముగ్గురినీ కిడ్నార్‌ - మ‌ర్డ‌ర్ కేసులో దోషులుగా నిర్ధారించారు. ఢిల్లీ అద‌న‌పు సెష‌న్స్ కోర్టు వీరికి శిక్ష‌లు ఖారారు చేసింది.

కొసమెరుపు ఏంటంటే... టీవీ జ‌ర్న‌లిస్ట్ సౌమ్యావిశ్వ‌నాథ‌న్ హ‌త్య కేసులో కూడా ఈ ముగ్గురే ప్ర‌ధాన‌ నిందింతులుగా ఉండ‌టం! ఆ హత్య కూడా అర్ధ‌రాత్రి వేళ‌లోనే జ‌రిగింది. 2008 - సెప్టెంబ‌ర్ 30న సౌమ్య హ‌త్య‌కు గురైంది. జిగిషా కేసు ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసుల‌కు అనుమానం రావ‌డంతో ఆ కోణంలో కూడా విచార‌ణ సాగించారు.
Tags:    

Similar News