క్రిష్ణా ఎల్లా చెప్పినట్లే జరిగిందా? ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్ వర్కర్ మరణం

Update: 2021-01-06 04:04 GMT
షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్న 41 ఏళ్ల హెల్త్ వర్కర్ ఒకరు అనూహ్యంగా మరణించిన వైనం సంచలనంగా మారింది. పోర్చుగల్ లో జనవరి ఒకటిన చోటు చేసుకున్న ఈ ఘటన కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. సోనియా అసెవెడో అనే 41 ఏళ్ల మహిళ.. పోర్చుగీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలోని పీడియాట్రిక్స్ విభాగంలో పని చేస్తుంటారు. ఆమె ఫైజర్ వ్యాక్సిన్ షాట్ తీసుకున్న వైనాన్ని తన ఫేస్ బుక్ ఖాతాలో రాసుకున్నారు. ఇదిలా ఉంటే.. వ్యాక్సిన్ తీసుకున్న 48 గంటలకే ఆమె మరణించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.

బాధితురాలి తల్లి మాట్లాడుతూ.. తమ కుమార్తెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న ప్రాంతంలో కొంత అసౌకర్యంగా ఉందన్న ఆమె.. రెండు రోజులకే మరణించారు. బాధితురాలికి కరోనా లక్షణాలు లేవని.. అయినా వ్యాక్సిన్ తీసుకున్నట్లు చెప్పారు. అసెవెడో మరణానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లుగా పోర్చుగీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ తెలిపింది. ఫైజర్ తయారు చేసిన టీకాను తీసుకున్న 538 మంది ఆరోగ్య కార్యకర్తల్లో అసెవెడో ఒకరు.

ఇదిలా ఉంటే.. తమ వ్యాక్సిన్ ను మంచినీళ్లుగా అభివర్ణించటంపై భారత్ బయోటెక్ సీఎండీ క్రిష్ణా ఎల్లా ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా ఫైజర్ వ్యాక్సిన్ పై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ లో ఆ వ్యాక్సిన్ తయారు చేస్తున్న సీరమ్ కు ఆ వ్యాక్సిన్ వివరాలు తెలియవని పేర్కొన్నారు. ప్రభుత్వానికి కూడా సమర్పించలేదన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ వేసుకున్న మహిళ మరణించిన నేపథ్యంలో.. క్రిష్ణా ఎల్లా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరికి గుర్తుకు వచ్చేలా చేస్తున్నాయని చెప్పకతప్పదు.
Tags:    

Similar News