ఒక మానసిక వికలాంగురాలైన మహిళను అత్యాచారం చేయటం.. అది కూడా ఏడుగురి కలిసి.. అత్యంత దారుణంగా లైంగిక హింసకు పాల్పడటం. అనంతరం.. సదరు మహిళ శరీరాంగాల్ని బ్లేడ్ తో చీలికలు చేయటం.. ఆ తర్వాత ఆమెను హత్య చేయటం. ఇంత దారుణాతి దారుణమైన హింస.. జంతువులు కూడా చేయవేమో. అలా చేసిన ఏడు మానవ మృగాల్ని ఏం చేయాలి? ఆ ఏడుగురిలో చట్టం ప్రకారం.. మైనర్ ఉన్నాడు. వాడినేం చేయాలి? ఇవన్నీ ప్రశ్నలు. వీటికి సమాధానంగా తన బెంచ్ మీదకు వచ్చిన కేసు విషయంలో సదరు న్యాయమూర్తి ఎలాంటి తీర్పు ఇచ్చారో చూస్తే..
దారుణాతి దారుణంగా హింసించి ఒక అభాగ్య మహిళను అనాగరికంగా హింసింది.. చంపేసిన ఉదంతంపై హర్యానాలోని రోహ్ తక్ న్యాయమూర్తి కదిలిపోయారు. ఈ దారుణ నేరానికి పాల్పడిన దోషులకు మరణశిక్షను విధిస్తూ.. సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ‘‘నిర్భయ ఎన్నిసార్లు మరణించాలి. ఇలాంటి హీనాతిహీనమైన నేరాలకు కఠిన దండన ఉండాల్సిందే. అందుకే దోషులకు మరణశిక్షతోపాటు పదేళ్ల కారాగారవాసం.. రూ.50వేల చొప్పున జరిమానా విధిస్తున్నాం’’ అంటూ తీర్పును ప్రకటించారు. అయితే.. కోర్టు వెలువరించిన తీర్పును పంజాబ్.. హర్యానా హైకోర్టులు నిర్థారించాల్సి ఉంది. తీర్పు సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల గురించి బాధితుల తరఫు న్యాయవాది వివరిస్తూ.. ‘‘నేనూ మహిళనే. క్రూర మృగాల్లాంటి దుండగులు ఒక్కసారి లైంగిక దాడికి.. చిత్రహింసకు పాల్పడితే ఆ నిస్సహాయ మహిళ చేసిన ఆర్తనాదాలు నా చెవుల్లో గింగురుమంటున్నాయి’’ అన్నట్లు చెప్పారు.
ఇక.. ఈ కేసు విషయానికి వస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరి 1న బాధిత మహిళ గ్రామం నుంచి అదృశ్యమైంది. ఫిబ్రవరి నాలుగున బహు అక్బర్ పూర్ గ్రామంలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఈ కేసును కేవలం పది నెలల్లో విచారణ పూర్తి చేసిన న్యాయమూర్తి ధోషులకు శిక్షలు ఖరారు చేశారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమిటంటే.. మూడేళ్ల క్రితం ఢిల్లీలోని ఓ కదులుతున్న బస్సులో పారామెడికల్ విద్యార్థినిని అత్యంత అమానవీయంగా అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించి ఒక బాల నేరస్తుడి విషయంలో మూడేళ్ల జైలుశిక్ష అనంతరం ఆదివారం అతడ్ని విడుదల చేసిన ఉదంతం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోన్న సమయంలోనే మరో నిర్భయ ఉదంతంలో మరో మైనర్ బాలుడి పాత్ర ఉండటం. వయసులో చిన్న వారైనా.. చేసే నేరాల తీవ్రత పెద్దగా ఉన్నప్పుడు ఏం చేయాలి? పిల్లాడు కదా అని వదిలేయాలా..? లేక.. వారిలో మానసిక పరివర్తన తీసుకురావాలంటూ ధర్మోపదేశాలు వల్లిస్తూ ఉండాలా? లేక.. ఇలాంటి దరిద్రపుగొట్టు చట్టాల్ని వెనువెంటనే మార్చాలని పోరాడాలా..?