అదేంటి పవన్ ది వేరే పార్టీ, టీడీపీ మరో పార్టీ. పైగా అక్కడ ఉన్నది తండ్రీ కొడుకులు. మరి వారి మధ్య పవన్ మాట ఏంటి అసలు డిబేట్ దాకా కధ ఎందుకు వచ్చింది. ఇలాంటి సందేహాలు చాలానే ఉన్నాయి. కానీ జనసేన అధినాయకుడు పవన్ ఇపుడు ఎవరు కాదన్నా ఏపీలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఉన్నారు. దాంతో ఆయన గురించి వైసీపీ, టీడీపీలలో చర్చలు జరగడం సహజం. అలాగే టీడీపీలో కూడా ఇపుడు జనసేనాని గురించి పెద్ద ఎత్తున జరుగుతోంది. అదే టైమ్ లో పార్టీని నడిపిస్తున్న చంద్రబాబు లోకేష్ బాబుల మధ్య కూడా పవన్ ప్రస్థావన వస్తోంది.
ఇంతకీ విషయం ఏంటి అంటే లోకేష్ పవన్ విషయంలో ఒక అభిప్రాయంతో ఉన్నారు. జనసేనతో పొత్తులు వద్దు అన్నదే లోకేష్ భావన. అంతే కాదు ఆయన గట్టి నమ్మకం. అంతకంటే ఆయన విధానం అని కూడా చెప్పుకోవచ్చు. లోకేష్ అంటున్నదేంటి అంటే ఏపీలో టీడీపీకి మంచి బలం ఉంది. వైసీపీ మీద ఉన్న తీవ్రమైన వ్యతిరేకత కచ్చితంగా టీడీపీ వైపే నూటికి నూరు పాళ్ళూ టర్న్ అవుతుంది అని కూడా లోకేష్ భావిస్తున్నారు. ఏపీలో ఉన్న ఉమ్మడి పదమూడు జిల్లాలలో టీడీపీ క్షేత్ర స్థాయిలో బలంగా ఉంది అన్నది లోకేష్ మాట.
ఇక క్యాడర్ కూడా కసి మీద ఉన్నారు. ఈసారి ఎలాగైనా టీడీపీని గెలిపించుకోవాలన్న ఉద్దేశ్యంతో వారు పట్టుబట్టి ఉన్న వేళ ఒంటరి పోరే బెటర్ అన్నది లోకేష్ వాదనగా కనిపిస్తోంది. అలా చేస్తే కనుక కచ్చితంగా మంచి మెజారిటీతో టీడీపీ ఏపీలో పవర్ లోకి వస్తుంది అని కూడా ఆయన నమ్ముతున్నారు. అయితే ఇక్కడ ఆయన తండ్రి, టీడీపీ అధినాయకుడు చంద్రబాబు విభేదిస్తున్నారు.
చంద్రబాబు మాటలను కూడా కొట్టిపారేయడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ఎన్నో రాజకీయ యుద్ధాలను చూసిన ఆరితేరిన యోధుడు. పైగా అపర చాణక్యుడు. అందువల్ల చంద్రబాబు అనేది ఏంటి అంటే పొత్తులు అవసరం అని. 2019 ఎన్నికల్లో పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేయడం వల్ల భారీగా నష్టపోయామన్నది బాబు వాదన. ఇక జనసేనకు బలం ఉందని, అది టీడీపీని డ్యామేజ్ చేసే స్థాయిలో కూడా ఉందని బాబు నమ్ముతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో జనసేన బాగా పుంజుకుందని, అందువల్ల పొత్తులు లేకపోతే అక్కడ టీడీపీకి గట్టి దెబ్బ పడుతుందేమో అన్న కంగారు బాబులో ఉంది.
అందుకే ఆయన జనసేనతో పొత్తులు కావాలని వాదిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో త్రిముఖ పోటీ జరిగితే కచ్చితంగా అది వైసీపీకే లాభిస్తుంది అన్నదే చంద్రబాబు వాదన. అది నిజం కూడా. ఇప్పటిదాకా వచ్చిన సర్వేలు చూస్తే జనసేన్ టీడీపీ వైసీపీ విడివిడిగా పోటీ చేస్తున్నట్లుగా చూపించి అంచనాలు కట్టారు. అలాంటి సందర్భంలో సీట్లూ ఓట్లు తక్కువ అయినా వైసీపీ ఏదో విధంగా గట్టెక్కుతుందని సర్వేశ్వరులు కొన్ని లెక్కలు చూపించి మరీ చెబుతున్నారు.
సర్వేల కంటే కూడా పాదరసం లాంటి చంద్రబాబు బుర్రకు ఈ విషయాలు తెలియనివి కావు. అందుకే ఆయన పొత్తు లాభం, పోరు నష్టం అన్నట్లుగా ఆలోచన చేస్తూ కొడుకు లోకేష్ మాటలతో విభేదిస్తున్నారు. అయితే లోకేష్ మాత్రం ఒంటరి పోరు అంటున్నారు. ఇక్కడ మరో విషయం కూడా ఉంది. పవన్ పొత్తులు అంటే ఈసారి తేలికగా ఒప్పుకోరు. అధికారంలో వాటా కోరుకుంటున్నారు. అది కూడా తొలి రెండేళ్ళో మూడేళ్ళో జనసేనకే చాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
అలాగే సీట్ల విషయంలో కూడా గొంతెమ్మ కోరికలు జనసేన నుంచి పెద్ద స్థాయిలోనే ఉన్నాయి. అది టీడీపీలో చాలా మందికి చికాకుగానే ఉందిట. అందుకే వారంతా లోకేష్ ద్వారా చంద్రబాబు మైండ్ ని మార్చాలని చూస్తున్నారు. అయితే బాబు మాత్రం ఎన్ని వత్తిడులు వచ్చినా జనసేనతో ఏదో కాడికి పొత్తు పెట్టుకుంటేనే వైసీపీ ఓడించగలమని, పార్టీ కూడా మరిన్నాళ్ళు నిలబడుతుందని ఆలోచిస్తున్నారుట.
ఇక పవన్ కి అధికారం షేరింగ్ అంటే ఈ దఫాలో లోకేష్ సీఎం అయ్యే చాన్స్ కూడా లేనట్లే. అందుకే చినబాబు పవన్ తో పొత్తు వద్దు అనడానికి మరో బలమైన కారణంగా దీన్ని చూపిస్తున్నారు. పొత్తుల పేరిట ఒకసారి తగ్గి జనసేనకు అధికారం కల్పిస్తే ఏపీలో ఆ పార్టీ బలంగా మారుతుందని, రేపటి రోజున అది టీడీపీకే దెబ్బ తీస్తుందన్న భయాలు కూడా చాలా మంది టీడీపీ వారిలో ఉన్నాయట. మొత్తానికి పవన్ తో పొత్తుకు చంద్రబాబుకు ఇంట్లోనే గట్టి వ్యతిరేకత ఎదురవుతోంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో చివరికి.