గతంలో ఎన్నడూ చూడని వినని ఒక అరుదైన చర్చకు ఏపీ సర్కార్ తెర తీసింది. రాష్ట్ర శాసనసభలో హై కోర్టు తీర్పు మీద చర్చకు పెట్టింది. స్వల్పకాలిక చర్చగా ఇది జరిగినా చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడారు, ముఖ్యమంత్రి జగన్ కూడా చాలా సేపు మాట్లాడి వ్యవస్థల మధ్య పరిధుల గురించి చెప్పుకొచ్చారు. ఇక ఇపుడు చూస్తే ఇదే అంశం మీద అంతటా చర్చ సాగే పరిస్థితి ఏర్పడింది.
ఇక శాసన వ్యవస్థకు ఉన్న అధికారాలు ఏంటి, వారు ప్రజలకు ఎంత మేరకు జవాబుదారులు అన్న వాటి మీద అయితే విస్తృత స్థాయిలోనే చర్చ సాగుతోంది. ఈ నేపధ్యంలో వైసీపీ ఈ చర్చకు ఇంతటితో కాకుండా పార్లమెంట్ వేదికగా కూడా లేవదీసే అవకాశం ఉందా అన్న మాట కూడా వస్తోంది. నిజానికి ఇది వైసీపీ సమస్య కాదు, శాసన వ్యవస్థ అధికారాల మీద చర్చ కాబట్టి పార్లమెంట్ లో చర్చించడం కూడా మేలు అన్న మాట వస్తోంది.
అదే సమయంలో జాతీయ స్థాయిలో కూడా ఈ అంశం చర్చకు రావాలంటే పార్లమెంట్ లో చర్చ పెట్టడం మంచిది అన్న సూచనలు కూడా అధికార పక్షానికి వస్తున్నాయిట. వైసీపీకి రెండు సభలలో కలుపుకుని ఏకంగా 28 మంది ఎంపీలు ఉన్నాయి. కేంద్రంతో మంచి సంబంధాలు ఉన్నాయి.
మరి ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన చర్చ, అలాగే రాజ్యాంగబద్ధమైన చర్చ అని భావించగలిగితే పార్లమెంట్ లో కూడా దీని మీద బిగ్ డిబేట్ జరిగే చాన్స్ ఉంది. అయితే కేంద్రంలోని ప్రభుత్వం దీనికి ఎంతవరకూ సహకరిస్తుంది అన్న మాట కూడా ఉంది. ఈ చర్చ లేవనెత్తడం అంటే ఇండైరెక్ట్ గా న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడడమే.
కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఆలోచన చేస్తుంది అన్న మాట ఒక వైపు ఉంది. అయితే దీని మీద వైసీపీ ఎంపీలు ఇతర పార్టీల సభ్యులను కలుపుకుని ఒక చర్చ కోసం డిమాండ్ చేస్తే అటు లోక్ సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ స్వల్పకాలిక చర్చకు ఆస్కారం ఉంటుందా అన్నది చూడాలి.
ఏదేమైనా కూడా ఏపీలో ఈ అంశం మీద చర్చించి దేశంలోనే ఒక బిగ్ డిబేట్ కి చాన్స్ ఇచ్చిన వైసీపీ ఈ ఊపులో పార్లమెంట్ లో కూడా ఈ అంశాన్ని లేవనెత్తుతుందా అన్నది చూడాలి. దీని మీద మేధావులు న్యాయ నిపుణులు మాత్రం ఇలాంటి చర్చల వల్ల అర్ధవంతమైన పరిష్కారాలకు కూడా వీలు ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో చర్చించడం మంచిదే అంటున్నారు. మరి వైసీపీ అధినాయకత్వం దీని మీద ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.