ప్రజల ఆరోగ్యానికి హాని చేసే వాటి విషయంలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. బ్యాడ్ లక్ ఏమంటే.. ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని.. వారి ఆర్థిక పరిస్థితిని దారుణంగా దెబ్బ తీస్తాయన్న విషయాలపై అవగాహన ఉన్నప్పటికీ.. వాటి విషయంలో మాత్రం పెద్ద పట్టనట్లుగా వ్యవహరిస్తూ.. వాటి కారణంగా వచ్చే ఆదాయాల మీద ప్రభుత్వాలు చేసే ఫోకస్ అంతా ఇంతా కాదు.
ఎక్కడి దాకానో ఎందుకు? మద్యంతో ప్రజలకు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే మద్యాన్ని ప్రభుత్వమే అమ్మటం ఒక ఎత్తు. దానితో వచ్చే ఆదాయాన్ని వదులుకోవటానికి ఏ ప్రభుత్వం సిద్ధంగా ఉండకపోవటం కనిపిస్తుంది.
ఇక.. సిగిరెట్ వినియోగం ఆరోగ్యాన్ని ఎంత దారుణంగా దెబ్బ తీస్తుందో.. కుటుంబాల మీద ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతిగా సిగిరెట్లు తాగే వారి ఆరోగ్యం దెబ్బ తిని.. దాని కారణంగా కటుంబాలకు ఎదురయ్యే ఆరోగ్య సవాళ్లు.. వారిని మానసికంగానే కాదు.. ఆర్థికంగా కూడా దెబ్బ తీస్తుంది. అందుకే.. ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వాలు కఠినంగా ఉండాలని చెబుతారు.
కానీ.. వాటిని అస్సలు పట్టించుకోకుండా.. వాటి అమ్మకాలతో వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు.. పాలనకు వినియోగించటం మనం అన్ని రాష్ట్రాల్లో చూస్తేనే ఉంటాం.
ఇదే సమయంలో నమిలే పొగాకు.. గుట్కా.. తంబాకు.. పాన్ మసాలా లాంటి వాటిపై మాత్రం బ్యాన్ చేస్తూ ఉంటుంది ప్రభుత్వం. మద్యం.. సిగిరెట్ మాదిరి.. ఈ వస్తువులు కూడా ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చూస్తే.. ఈ రోజు నుంచి ఏపీలో నమిలే పొగాకు.. గుట్కా.. తంబాకు.. పాన్ మసాలాలనను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఏడాది పాటు సాగే ఈ బ్యాన్ ఈ రోజు అమల్లోకి రానుంది. నికోటిన్ కలిపిన ఆహార ఉత్పత్తులు అన్నింటిపైనా బ్యాన్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. వీటిని అమ్మటం.. కొనటం.. తయారు చేయటం.. నిల్వ ఉంచటం లాంటివి ఏం చేసినా నేరమని.. నిబంధనల్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. మరి.. సర్కారు విధించిన ఈ బ్యాన్ ఏ రీతిలో ఉంటుందో చూడాలి.