బ్రేకింగ్: ఇద్దరు ఎమ్మెల్యేలకు పాజిటివ్

Update: 2020-06-17 13:15 GMT
దేశానికి రాజధాని ఢిల్లీ కరోనాకు కూడా రాజధానిగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విచ్చలవిడిగా కేసులు నమోదుకావడం.. విస్తృతంగా వైరస్ వ్యాప్తి చెందుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

దేశ రాజధాని ఢిల్లీలో పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ఢిల్లీ కూడా ఉంది. ఈ క్రమంలోనే అందరికీ వైరస్ వ్యాపిస్తోంది.

తాజాగా ఢిల్లీలోని ఇద్దరు ఆప్ ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చింది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన దక్షిణ ఢిల్లీలోని కల్యాజీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆతిషీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అతడితోపాటు మరో ఎమ్మెల్యే అక్షయ్ మరాఠేకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

దీంతో ఢిల్లీ ప్రభుత్వంలో కరోనా పాజిటివ్ వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యేలను కలిసిన వారిని గుర్తించే పనిలో అధికారులున్నారు.

కరోనా కట్టడికి కృషి చేస్తూ ఆయా ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే అతిషికి కరోనా రావడంతో ఆమె త్వరగా కోలుకోవాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
Tags:    

Similar News