కేంద్రంలో క్లిస్టర్ క్లియర్ మెజారిటీతో వరుసగా రెండో పర్యాయం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీకి... ఢిల్లీలో వరుసగా మూడో సారి క్లిస్టర్ క్లియ్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నిజంగానే గట్టి దెబ్బ కొట్టేసిందని చెప్పాలి. అంతేనా... సింగిల్ గానే ‘చీపురు’ పట్టి జాతీయ పార్టీలైన బీజేపీ - కాంగ్రెస్ లను ఢిల్లీలో ఊడ్చేసిన ఆప్ అధినేత - ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్... ప్రధాని నరేంద్ర మోదీ - కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశారని కూడా చెప్పక తప్పదు. దేశంలో జాతీయ జనాభా రిజిస్టర్ - జాతీయ పౌరుల రిజిస్టర్ లను అమలు చేసి తీరతామంటూ మోదీ - షాలు వరుస ప్రకటనలు చేస్తున్నా పట్టించుకోని కేజ్రీ... ఢిల్లీలో ఆ రెండింటిని జరగనిచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఈ మేరకు ఎన్పీఆర్ - ఎన్నార్సీలకు వ్యతిరేకంగా శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఎన్పీఆర్ - ఎన్నార్సీలపై చర్చించడానికి శుక్రవారం జరిగిన ఒకరోజు ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వాటిని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించారు. ఈ సందర్భంగా బిల్లుపై కేజ్రీ మాట్లాడుతూ.. తనతో పాటు తన మంత్రివర్గంలోని చాలామందికి బర్త్ సర్టిఫికెట్లు లేవని సంచలన ప్రకటన చేశారు. తమలాంటి వారికే సరైన పత్రాలు లేనప్పుడు... ఇక సామాన్యుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
కేంద్ర మంత్రులకు ప్రభుత్వం జారీ చేసిన జనన ధృవీకరణ పత్రాలు ఉంటే.. నిర్ధారించాలని కూడా కేజ్రీ ఏకంగా సవాలు చేశారు. 70 మంది సభ్యులు గల ఢిల్లీ అసెంబ్లీలో కేవలం 7గురికి మాత్రమే బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. పత్రాలు లేనందున తమను కూడా నిర్బంధ కేంద్రాలకు పంపుతారా? అని ప్రశ్నించారు. పౌరుల పౌరసత్వాన్ని ప్రశ్నించే వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని కేజ్రీ కోరారు. ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఇదివరకే పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానం చేసినా కేంద్రం పెద్దగా పట్టించుకోలేదనే చెప్పాలి. అయితే దేశ రాజధాని ఉన్న ఢిల్లీలోనే ఈ విషయంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన నేపథ్యంలో మోదీ సర్కారు చిక్కులు తప్పేలా లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి.