దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కారు ప్రమాద ఘటన అనేక మలుపులు తిరుగుతోంది. స్కూటీపై వెళ్తున్న అంజలిని మద్యం మత్తులో ఉన్న యువకులు కారుతో ఢొకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటన దేశం మొత్తాన్నీ నివ్వెర పోయేలా చేసింది. అయితే ఈ సమయంలో ఆమె స్నేహితురాలు నిధి స్పాట్‌లోనే ఉన్నట్టు తెలిసింది. అంజలి కారు కింద నలిగిపోవడం చూసి కూడా ఆమె సాయం చేయకుండా.. కనీసం స్పాట్‌లో ఉండి పోలీసులకు ఫోన్ కూడా చేయకుండా.. అక్కడ నుంచి వెళ్లిపోవడాన్ని నెటిజన్లు తప్పు పడుతున్నారు. అంతేకాదు.. అంజలిదే తప్పు అని నిధి మాట్లాడడం.. మరింతగా వివాదాన్ని పెంచింది.
నిధి తీరుపై ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్మన్ స్వాతి మలివాల్ మండిపడ్డారు. చనిపోయిన ఫ్రెండ్ గురించి ఇలా మాట్లాడటమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. "నీ కళ్ల ముందే అంజలి కారు కింద పడి నలిగిపోతుంటే చూసి పారిపోయావ్.. నువ్వేం ఫ్రెండ్‌వి" అని ఫైర్ అయ్యారు. విపత్కర పరిస్థితిలో స్నేహితురాలిని విడిచిపెట్టి వెళ్లిన నీ లాంటి వాళ్లను ఎలా నమ్మాలి అని వ్యాఖ్యానించారు.
అసలు ఏం జరిగింది?
ఈనెల 1న అంజలి, నిధి స్కూటీపై వెళ్తుండగా వీరి వాహనాన్ని కారు ఢీకొట్టింది. కారు చక్రాల కింద అంజలి ఇరుక్కుంది. తాగిన మత్తులో ఉన్న ఐదుగురు యువకులు ఈ విషయాన్ని గమనించకుండా కారును కిలోమీటర్ల మేర తిప్పారు. దీంతో ఆమె దారుణంగా చనిపోయింది. కంఝవాల ప్రాంతంలో ఉదయం అంజలి మృతదేహం నగ్నంగా లభ్యమవ్వడం కలకలం రేపింది. ఈ ఘటనలో నిధికి ఎలాంటి గాయాలు కాలేదు.
అంజలి శవపరీక్ష నివేదికలో ఆమెకు 40 వరకు గాయాలైనట్లు తేలింది. అయితే మృతురాలి మిత్రురాలు నిధి చెప్పిన విషయాలకు.. శవపరీక్షలో వెల్లడైన నివేదికలతో పొంతన లేనందున.. మృతురాలు కుటుంబసభ్యులు ఇది పక్కా ప్లాన్డ్ మర్డర్గా అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో అంజలి మద్యం తాగి ఉందని నిధి పేర్కొంది. దీనిపై అంజలి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
అసలు తాము నిధిని ఎప్పడూ తాము చూడలేదని తెలిపారు. అంజలిని ఉద్దేశపూర్వకంగానే హత్య చేసి ఉంటారని కుటుంబసభ్యులు ఆరోపించారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను శిక్షించాలని తల్లి డిమాండ్ చేశారు.
"పోస్టుమార్టం నివేదికలో మద్యం ఆనవాళ్లు లేవని తెలిపారు. ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్య. నిధి చెప్పిన మాటలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం సమయంలో ఇద్దరు కలిసి ఉన్నప్పుడు.. ఒకరు ఎటువంటి గాయాలు లేకుండా ఎలా తప్పించుకోగలిగారు?" అని అంజలి కుటుంబసభ్యుడు భూపేంద్ర సింగ్ చౌరాసియా ప్రశ్నించాడు. మొత్తానికి ఈ కేసు చాలా మిస్టరీగా మారడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.