భారీ అంచనాలకు తావివ్వకుండా.. చాప కింద నీరు మాదిరి వ్యవహరిస్తూ.. ఒక రాష్ట్రం తర్వాత ఇంకో రాష్ట్రంలోని అధికారాన్ని చేజిక్కించుకోవటమే లక్ష్యమన్నట్లుగా అడుగులు వేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.
తాజాగా ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తా చాటాలని తపిస్తున్న కేజ్రీవాల్.. అందుకు అవసరమైన ఏ చిన్న అంశాన్ని వదిలిపెట్టేందుకు తాను సిద్ధంగా ఉన్న విషయాన్ని తాజాగా చేసిన వ్యాఖ్య స్పష్టం చేస్తుందని చెప్పాలి.
గుజరాత్ లోని కాషాయ కోటను బద్ధలు కొట్టేందుకు వీలుగా ఆ రాష్ట్రంలో వరుస పెట్టి రివ్యూ సమావేశాన్ని నిర్వహిస్తున్న కేజ్రీవాల్.. వల్సాద్ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారానికి హాజరయ్యారు. అధికారంలో ఉన్న బీజేపీని ఓడించేందుకు దేనికైనా సిద్ధమన్న ఆయన.. ''బీజేపీని ఓడించేందుకు ఏదైనా చేయాలి.
ఇదే విషయాన్ని బీజేపీ నేతలు.. కార్యకర్తలు నాతో చెబుతున్నారు. అలాంటి వారు ఆమ్ ఆద్మీకి మద్దతుగా నిలుస్తున్నారు. అలానే మీరు కూడా రహస్యంగా మాకు పని చేయాలి. దాదాపుగా 27 ఏళ్లు పవర్లో ఉన్న బీజేపీ గుజరాతీలకు చేసిందేమీ లేదు. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి అవకాశం ఇవ్వండి. కొత్త ఆలోచనలకు చోటు ఇవ్వండి'' అని పిలుపునిచ్చారు.
తమ పార్టీకి మద్దతు ఇస్తే.. వ్యాపారస్తుల్ని బీజేపీ ఉత్తినే ఊరుకోదని.. అందుకే.. బీజేపీని దెబ్బ తీసేందుకు సీక్రెట్ గా పని చేయాలని కోరుతున్నట్లుగా పేర్కొన్నారు.
తాను హిందూ వ్యతిరేకినని పోస్టర్లు పెట్టిన వారికి ఘాటు రిప్లై ఇస్తూ.. పోస్టర్లు ఏర్పాటు చేసిన వారంతా రాక్షస వారసులు అని కౌంటర్ ఇచ్చారు. ఓపెన్ గానే తనకు.. తన పార్టీకి సీక్రెట్ గా పని చేయాలన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.
దాదాపు అల్లు అర్జున్ ఫైనల్ కథను వినిపించినట్లుగా తెలుస్తోంది. బన్నీకే కథ నచ్చడంతో తప్పకుండా పాన్ ఇండియా రేంజ్ లోనే సినిమా చేయాలి అని ఆలోచనతో ఉన్నాడట.