తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ కు మధ్య స్నేహం బడుపడుతోంది. అధికారుల బదిలీలపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌పై పోరాటంలో భాగంగా శనివారం హైదరాబాద్ వస్తున్నారు. విపక్షాల మద్దతు కూడగట్టుకునేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ను కలవనున్నారు. అయితే ఈ భేటీ కేవలం ఆర్డినెన్స్ వ్యతిరేక మద్దతు కోసం మాత్రమే కాదని, దీని వెనుక పెద్ద కథే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఢిల్లీ ఉద్యోగులపై అధికారాల విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రికి, కేంద్రానికి మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. 2015 నుండి కోర్టులో నడుస్తున్న ఈ కేసుపై 8 సంవత్సరాల తర్వాత కేజ్రీవాల్‌కు అనుకూలంగా తీర్పు వెలువడింది. అయితే అనుకూల తీర్పు రాకపోవడంతో కేంద్రం ఈ విషయమై ప్రత్యేక ఆర్డినెన్సును తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ను సిఎం కేజ్రీవాల్ వ్యతిరేకిస్తున్నారు. తీర్పు వచ్చిన 8 రోజుల్లోనే కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడంపై ఆయన విరుచుకుపడ్డారు. దీంతో ఈ విషయమై విపక్ష పార్టీల నాయకుల మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గె, రాహుల్ గాంధీని కలిసేందుకు నిర్ణయించుక్ను కేజ్రీవాల్ తాజాగా శనివారం తెలంగాణ సిఎం కేసిఆర్‌ను కలుస్తున్నట్లు తెలిపారు. అయితే కేవలం ఆర్డినెన్సుకు వ్యతిరేక మద్దతు కోసం మాత్రమే కాదని, ఇందులో రాజకీయ కోణం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేసిఆర్, కేజ్రీవాల్ ఈ మధ్య కుదుర్చుకున్న రాజకీయ స్నేహం గురించి తెలిసిందే. తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి కేజ్రీవాల్ హాజరవగా, కేజ్రీవాల్ కు అనుకూలంగా కేసిఆర్ వ్యవహరిస్తున్నారు.
బిజెపి వ్యతిరేకంగా వెళ్తున్న ఆమ్ ఆద్మీ, బిఆర్‌ఎస్ పార్టీలు కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జాతీయ పార్టీగా ప్రకటించుకున్న బిఆర్‌ఎస్.. జాతీయ స్థాయి పార్టీల మద్దతుకు ప్రయత్నిస్తోంది. బిజెపితో ఇదివరకే రాజకీయ శతృత్వం ఉన్న కేజ్రీవాల్ ఇలాంటి పార్టీల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలోనే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం ఆ పార్టీలకు మరింత ఊతమిచ్చినట్లయింది.
త్వరలో సార్వత్రిక ఎన్నికలు రాన్ను నేపథ్యంలో కేసిఆర్, కేజ్రీవాల్ రాజకీయ చర్చల్లో భాగంగా శనివారం హైదరాబాద్ వస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్‌తో కలిస్తే ఎలా ఉంటుంది. బిజెపికి వ్యతిరేకంగా నిలువగలమా. ఇంకా ఏ రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టుకోవాలనే అంశాలను చర్చించుకుని.. ఓ ఒప్పందానికి వచ్చే నిమిత్తమే ఈ సమావేశం ఉద్ధేశమని స్పష్టంగా తెలుస్తోంది.