శ్రీలంక అందాల భామ.. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీ పోలీసులు వచ్చే నెలలో విచారణకు హాజరు కావాల్సిందిగా మరోసారి సమన్లు జారీ చేసినట్లు ఈరోజు ఉదయం వార్తలు వచ్చాయి. ఇది కాకుండా ఢిల్లీ కోర్టు కూడా ఇప్పటికే జాకీకి సమన్లు జారీ చేసింది. సుకేష్ చంద్రశేఖర్ రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు లో జాక్విలిన్ ని నిందితుల్లో ఒకరిగా పేర్కొంటూ దర్యాప్తు సంస్థ కొత్త చార్జిషీట్ ను దాఖలు చేసిన తర్వాత సమన్లు జారీ అయినట్టు తెలుస్తోంది.
సుకేష్ చంద్రశేఖర్ కేసు గురించి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ప్రతిదీ ముందే తెలుసునని దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఏజెన్సీ పేర్కొన్న వివరాల ప్రకారం.. సుకేష్ చంద్రశేఖర్ కేసు గురించి జాకీకి అన్నీ తెలుసు. మనీలాండరింగ్ కేసు దర్యాప్తు నుండి తప్పించుకోవడానికి ఒక తప్పుడు కథనాన్ని వండి వారుస్తోందని ఆరోపించింది.
తాజా నివేదికల ప్రకారం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తన ఛార్జిషీట్ లో నిందితురాలు లీనా మారియా అతడిని వివాహం చేసుకున్నట్లు జాక్విలిన్ కి ముందే తెలుసునని పేర్కొంది. సుకేష్ చంద్రశేఖర్ నేర పూరిత చరిత్ర గురించి .. లీనా మారియా పాల్ ఫిబ్రవరి 2021 లో అతనికి భార్యగా ఉందనే వాస్తవం గురించి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు బాగా తెలుసు..అని ఛార్జి షీట్ లో పేర్కొన్నారు.
ఇంకా ఈ ఛార్జిషీట్ లో పలు అంశాలను ప్రస్థావిస్తూ.. జాకీ స్పృహతోనే నేర గతాన్ని పట్టించుకోకుండా స్నేహం చేయడమే గాక అతనితో ఆర్థిక లావాదేవీలను కొనసాగించింది. ఫిబ్రవరి 2021లో సుకేష్ పాపులారిటీ గురించి ఆమెకు హెయిర్ స్టైలిస్ట్ తెలియజేసినట్లు పేర్కొంది. అనంతరం సుకేష్ తో జాకీ సంబంధాన్ని కొనసాగించింది. సుకేష్ నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందింది. అతడిని తమ అవసరాలకు ఉపయోగించారు. బాగా ఆనందించారు.. ఈ జాల్సాలన్నీ నేరాల ద్వారా వచ్చిన ఆదాయం తప్ప మరొకటి కాదు!! అని ఛార్జిషీట్ పేర్కొంది.
బాధితురాలిగా తప్పించుకోవడానికి జాక్వెలిన్ చేసిన ప్రయత్నాల గురించి ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన ఛార్జిషీట్ లో పేర్కొంది. ఆమె బాధితురాలిగా చెప్పుకున్నప్పటికీ విచారణ సమయంలో సుకేష్ బాధితురాలిని అని నిర్ధారించే గొప్ప సాక్ష్యాలను అందించడంలో ఆమె విఫలమైందని ఏజెన్సీ పేర్కొంది. ఆమె ఫోన్ ను క్లీన్ చేసి కీలకమైన సాక్ష్యాలను తొలగించింది. ఇది సాక్ష్యాధారాలను తారుమారు చేయడమేనని ఏజెన్సీ తాజా ఛార్జ్ షీట్ లో పేర్కొంది.
అందాల జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుకేష్ చంద్రశేఖర్ కు సంబంధించిన క్రిమినల్ విచారణలో ఎరక్కపోయి చిక్కుకున్నారు. 200 కోట్ల మనీలాండరింగ్ కేసు నిందితుల్లో జాక్వెలిన్ ను ఒకరిగా పేర్కొన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ప్రస్తుతం కోర్టుకు తమ నివేదికలు అందిస్తోంది.
జాకీ అతడి నుంచి ఐదు వాచ్ లు .. 20 నగలు.. 65 జతల బూట్లు.. 47 డ్రెస్ లు... 32 బ్యాగులు.. 4 హెర్మీస్ బ్యాగులు.. తొమ్మిది పెయింటింగ్ లు .. ఒక వెర్సెస్ క్రాకరీ సెట్ ను స్వీకరించినట్లు అంగీకరించింది. మోసగాడి నుండి బహుమతులుగా మాత్రమే వీటిని అందుకుంది. ఇవే కాకుండా ఏప్రిల్ 2021లో జాక్వెలిన్ తల్లిదండ్రులకు చంద్రశేఖర్ రెండు కార్లను బహుమతిగా ఇచ్చాడని ఆ విషయాన్ని జాకీ విచారణలో వెల్లడించలేదని ఏజెన్సీ పేర్కొంది. అయితే సాక్ష్యాధారాలను ఎదుర్కొన్న తర్వాత సుకేష్ తనకు శ్రీలంకలోని వెల్గానాలో ఆస్తిని కొనుగోలు చేసినట్లు ఆమె అంగీకరించిందని విచారణ ఏజెన్సీ తెలిపింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.