కష్టకాలంలో వీధి వ్యాపారిని దోచుకున్న జనం..?

Update: 2020-05-22 09:10 GMT
ప్రస్తుతం ప్రపంచ దేశాలతో పాటుగా మన దేశం కూడా ఆ మహమ్మారి కారణంగా విపత్కర పరిస్థితులని ఎదుర్కొంటుంది. రోజురోజుకి వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. దీన్ని అరికట్టడానికి ఎంతగా చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కంట్రోల్ అవ్వడంలేదు. అయితే, లాక్ డౌన్ మారినంత కాలం పొడిగిస్తే ..పరిస్థితి చేయి దాటిపోతుంది అని భావించి - లాక్ డౌన్ నుండి కొన్ని సడలింపులు ఇచ్చింది కేంద్రం. దీనితో కొంతమేర మళ్లీ మునుపటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఇకపొతే ఒక మనిషి కష్టంలో పాలు పంచుకోకపోతే మనం మనిషిగా ఉండటం వ్యర్థం. బాగున్నప్పుడు విలువలు చెప్పి.. కష్టాల్లో ఉన్నప్పుడు తప్పులు చేస్తే ఇక విలువలకు అర్థం ఏం ఉంటుంది. అయితే, అసలు ఈ సంగతి ఏంటి ఇప్పుడు అని అనుకుంటున్నారా  ..పైన చెప్పిన డైలాగ్ కి సూట్ అయ్యే సంఘటన ఒకటి  ఢిల్లీలో తాజాగా జరిగింది.

ఆ ఘటన పై పూర్తివివరాలు చూస్తే ... చోటూ  అనే వ్యక్తి బండి మీద మామిడి పళ్లు పెట్టుకుని అమ్ముతుంటాడు. ఈ క్రమంలో నిన్న ఓ స్కూల్‌ దగ్గర పండ్ల బండి పెట్టుకుని వ్యాపారం చేసుకుంటుండగా.. చోటూ కు - పక్క దుకాణదారుడికి గొడవ జరిగింది. వారిద్దరూ అలా కొట్టుకుంటుండగా ఆ పక్క వెళ్లే జనాలు దీన్ని అదునుగా భావించి చోటూ బండి మీద ఉన్న మామిడి పళ్లను ఖాళీ చేసేసారు. తీరా ఆ గొడవ సర్దుమనిగి చోటు వచ్చి చూసేసరికి బండి మొత్తం ఖాళీ అయ్యింది. మొత్తంగా  30 వేల రూపాయల విలువైన మామిడి పళ్లను ఎత్తుకెళ్లారు. దీనితో అసలే కష్ట కాలంలో అందులో మామిడి పళ్ల రేటు ఆకాశాన్ని తాకుతుంది. ఈ సమయంలో  ఇదే చాన్స్‌ గా అందినకాడికి మామిడి పండ్లను ఎత్తుకొని వెళ్లడంతో చోటు కన్నీటిపర్యవంతం అవుతున్నాడు.
Tags:    

Similar News