భయపెడుతున్న బాబా వంగ... బలపరుస్తున్న ట్రంప్ వాగ్ధానం!
అవును... ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వాంజెలియా పాండేవా గుష్టెరోవా అనే బల్గేరియా అంధ ఆధ్యాత్మికవేత్త బాబా వంగ గురించి దాదాపు చాలా మందికి తెలిసిందే.
మరికొన్ని రోజుల్లో 2024 ఏడాది ముగిసి 2025లోకి అడుగుపెట్టబోతుంది ప్రపంచం. దీంతో... నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్నారు చాలా మంది ప్రజానికం. ఇప్పటికే వాటికి సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయని ఒకరంటే.. పూర్తయ్యాయని ఇంకొకరు అంటున్నారు. ఈ నేపథ్యంలో బాబా వంగ జోస్యం ప్రపంచాన్ని భయపెడుతుందనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వాంజెలియా పాండేవా గుష్టెరోవా అనే బల్గేరియా అంధ ఆధ్యాత్మికవేత్త బాబా వంగ గురించి దాదాపు చాలా మందికి తెలిసిందే. ఆమె చెప్పే జోస్యాలు చాలా వరకూ నిజమయ్యాయని అంటారు. ఈ నేపథ్యంలో.. 2025 ఏడాదికి సంబంధించిన ఆమె జోస్యాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఇందులో భాగంగా... అంతర్జాతీయంగా అశాంతి.. విధ్వంసాలకు మూలాలయ్యే అంచనాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో... పశ్చిమ దేశాల్లో యుద్ధం పుడుతుంద్ని, పెను విధ్వంసం జర్గుతుందని బాబా వంగా అంచనా వేశారు. సిరియా పతనం ముగుసిన వెంటనే పశ్చిమ, తూర్పు దేశాల మధ్య భారీ యుద్ధం ఉండొచ్చని అన్నారు.
ఇక.. ఈ యుద్ధం వసతం కాలంలో ఆరంభమవూతుందని.. మూడవ ప్రపంచ యుద్ధం ఉంటుందని చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో.. తూర్పులో మొదలయ్యే యుద్ధం పశ్చిమాన్ని నాశనం చేస్తుందని బాబా వంగ చెప్పినట్లు డైలీ స్టార్ కథనం పేర్కొంది. ఇదే సమయంలో.. సిరియా విజేత కాళ్ల మీద పడుతుందని వెల్లడించారు!
అయితే... ఇప్పటికే సిరియా అధ్యక్షుడు అసద్ దేశం విడిచి పారిపోవడంతో.. ఆ దేశం ఇప్పుడు తిరుగుబాటు దారుల చేతుల్లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. గతంలో తమపై చేసిన దాడిని ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే అనుకూల సమయం అని భావించిన ఇజ్రాయెల్ దళాలు.. సిరియాపై విరుచుకుపడుతున్నాయి.
మరొపక్క... 2025లో గ్రహాంతర వాసులతో మానవులకు కాంటాక్ట్ ఏర్పడవచ్చని బాబా వంగ అంచనా వేశారు. అయితే.. ఈ పరిణామం ప్రపంచ సంక్షోభానికి లేదా అంతానికి దారి తీయొచ్చని ఆమె హెచ్చరించారు. కాగా... గ్రహాంతర వాసులకు సంబంధించిన అన్ని ఫైల్స్ ను విడుదల చేస్తానంటూ ట్రంప్ ఇటీవల వాగ్ధానం చేసిన సంగతి తెలిసిందే.
ఇలా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, తర్వాత జరగబోయే పరిణామాలకు సంబంధించిన వాగ్ధానాలు వెరసి.. బాబా వంగ జోస్యానికి ప్రాధన్యత ఏర్పడిందనే చర్చ తెరపైకి వచ్చింది.