దాదాపు నెల రోజుల నుంచి కరోనా కేసులు తగ్గు ముఖం పడుతూ వస్తున్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జనవరిలో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత జనవరి చివరి వారం నుంచి బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. రోజురోజుకు పాజిటివిటీ రేటు దిగువకు వస్తుంది.
అయితే కరోనా కేసుల దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు కఠిన నిబంధనలు అమలు చేసింది. కోవిడ్ మూడో దశ అంటూ వైద్యారోగ్య శాఖ ప్రకటించిన నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా కేజ్రీవాల్ ప్రభుత్వం కఠిన ఆంక్షలను అమలు చేసింది. తాజాగా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ నిబంధనలు సడలించింది.
ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలో ఆంక్షలు సడలిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో విధించిన ఆంక్షలను సోమవారం నుంచి తొలగిపోతాయని కేజ్రీవాల్ వెల్లడించారు. పాఠశాలలు కూడా మార్చి 1 నుంచి పూర్తి స్థాయిలో తెరవాలని ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం నాడు ఢిల్లీ సర్కార్ వివరించింది.
ప్రస్తుతం కరోనా కేసులు తక్కువే ఉన్నాయని... ఆంక్షల వల్ల వ్యాపారులు, చిన్న చిన్న పనులు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. అందుకే నైట్ కర్ఫ్యూ ను రద్దు చేసినట్లు ప్రకటించింది. అంతేకాకుండా దుకాణాలు, రెస్టారెంట్లు వంటివి అర్ధరాత్రి దాకా తెరిచే ఉంచవచ్చునని తెలిపింది.
గతంలో మాదిరిగానే ఏ ఆంక్షలు ఉండబోవని స్పష్టం చేసింది. అంతేకాకుండా మాస్కు ధరించకపోతే విధించే జరిమానా కూడా తగ్గించింది. మాస్క్ వేసుకోని వారి నుంచి ఇది వరకు రూ.1000 వసూలు చేయగా... దానిని రూ.500కు తగ్గిస్తూ ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ నిర్ణయం తీసుకుంది.
కరోనా ఆంక్షలు సడలించినా కూడా ప్రజలు పూర్తిగా నిర్లభ్యం చేయకూడదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. కరోనా కనీస నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. కాగా దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో పాజిటివ్ కేసులు 13 వేలకు దిగజారాయి.
ఇక మరణాల సంఖ్య కూడా చాలా వరకు తగ్గుతూ వస్తోంది. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ప్రస్తుతం ప్రికాషన్ డోసుల పంపిణీ చేస్తున్నారు.