ఢిల్లీ లిక్కర్ స్కాం: బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ టార్గెట్

Update: 2023-02-19 13:30 GMT
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసు రోజుకో ములుపు తిరుగుతోంది. ఇప్పటి వరకు ఈ కేసుతో సంబంధం ఉన్న వారికి నోటీసులు పంపించారు. కొందరని విచారణ చేశారు. మరికొందరిని అరెస్టు చేశారు. అయితే అరెస్టు చేసిన వారిలో ఇప్పటి వరకు పొలిటీషియన్స్ లేరు. ఇప్పుడు రాజకీయ పార్టీలైన బీర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలపై సీబీఐ గురి పెట్టినట్లు తెలుస్తోంది.  ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను గత అక్టోబర్ లో సీబీఐ విచారించింది. తాజాగా మరోసారి విచారించేందుకు నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న మరో పొలిటీషియన్ కల్వకుంట్ల కవితకు కూడా మళ్లీ నోటీసులు పంపిస్తారా? అని అనుకుంటున్నారు.

గత డిసెంబర్ 11న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను సీబీఐ విచారించింది. తనకు ఈ కేసుతో సంబంధం లేదని కవిత క్లారిటీ ఇచ్చారు. ఆ తరువాత సీఆర్పీసీలోని సెక్షన్ 191 ప్రకారం నోటీసులు జారీ చేసి కొన్ని డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందిగా కోరారు.

రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి వ్యక్తిగతంగా స్థిర, చరాస్తుల వివరాలు, కంపెనీ ఆర్థిక వ్యవహారాలు క్రోడీకరించి ఇవ్వాలని పేర్కొంది. ఆ తరువాత ఈ కేసులో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవను ఈడీ అరెస్టు చేసింది.

మద్యం కుంభకోణం కేసులో అవినీతి, అధికార దుర్వినియోగంపై సీబీఐ విచారిస్తుండగా.. మనీ ల్యాండరింగ్, అక్రమ మార్గాల్లో ముడుపుల రూపంలో డబ్బులు చేతులు మారడంపై ఈడీ విచారణ చేపడుతోంది. అయితే ఇప్పటి వరకు పోలిటికల్ తో సంబంధం లేని వ్యక్తులను ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారిస్తోంది. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతకు నోటీసులు పంపడంతో మరోసారి కల్వకుంట్ల కవిత పేరు తెరపైకి వచ్చింది.

అయితే సిసోడియా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. కవిత సాక్షిగా మాత్రమే ఉన్నట్లు సమాచారం. దీంతో కవిత విషయంలో సీబీఐ మరోసారి నోటీసులు పంపే ఆస్కారం లేదని తెలుస్తోంది.

గతంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి విషయంలో ఈడీ అధికారులు నోటీసులు పంపించారు. అయితే కేవలం విచారణ కోసమేనని అరెస్టులు ఉండకపోవచ్చని భావించింది. కానీ ఆ తరువాత రాఘవరెడ్డిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు కూడా కవితకు నోటీసులు రావనే అంటున్నారు. కానీ సీబీఐ ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తుంతో తెలియడం లేదు.

దీంతో మరోసారి విచారణ కోసం కవిత కు నోటీసులు వచ్చినా రావొచ్చని కొందరు అంటున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలను సీబీఐ టార్గెట్ చేసిందని కొందరు వాపోతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News