మోడీ ఇచ్చిన పిలుపు, అందించిన ఊపుతో దేశంలో స్టార్టప్ కల్చర్ ఇప్పటికే మొదలైంది. ఒకప్పుడు ఏదైనా సంస్థ, వ్యాపారం ప్రారంభించాలంటే వెనకాముందూ ఆలోచించేవారు.. కానీ, ఇప్పుడున్న స్టార్టప్ ల ఊపులో కొత్త సంస్థలను ఇట్టే లాంచ్ చేసి వ్యాపారం ప్రారంభించేస్తున్నారు. అయితే... ఇండియాలో ప్రస్తుతం స్టార్టప్ లు ఏ రేంజిలో ఉన్నాయన్నది అధ్యయనం చేసి ''ఇండియా స్టార్టప్ అవుట్ లుక్-2016'' పేరుతో ఒక నివేదిక విడుదల చేశారు. ఆ జాబితాలో ఢిల్లీ టాప్ లో నిలిచింది.
ఇంతకుముందు ఇండియా సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరు - వాణిజ్య రాజధాని ముంబైలు స్టార్టప్ కంపెనీల విషయంలో ముందుండేవి. తాజా జాబితాలో మాత్రం ఢిల్లీ ఆ రెండిటినీ ఓవర్ టేక్ చేసింది. ఇన్నోవాన్ క్యాపిటల్ సంస్థ విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం ఇప్పుడు అత్యధిక స్టార్టప్ కంపెనీలు ఢిల్లీలోనే మొదలయ్యాయట. కంజ్యూమర్ ఇంటర్నెట్ - ఈ కామర్స్ రంగాల్లో కొత్త కంపెనీలు పెద్ద సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. మెట్రో నగరాలు ఐటీ హబ్ లుగా మారుతున్న దశలో కంపెనీలకు విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తున్నాయి. ఈ నేపధ్యం ఇండియన్ స్టార్టప్ వ్యవస్థ శైశవ దశ నుంచి కొద్దిగా ఎదిగింది. అతి త్వరలోనే మరింతగా విస్తరిస్తాయని నివేదిక అంచనా వేస్తోంది.
స్టార్టప్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే దేశంలో ఉద్యోగ అవకాశాలు అమాంతం పెరిగే అవకాశం కనిపిస్తోందని అవుట్ లుక్ రిపోర్ట్ అంచనా వేసింది. వచ్చే ఏడాది 130 స్టార్టప్ కంపెనీలు ఐదు వేల ఉద్యోగాలను సృష్టిస్తాయని అంచనా. 97 శాతం స్టార్టప్ లు తమ కార్యకలాపాలను పూర్తిగా కొత్తవారితోనే ప్రారంభించాలని భావిస్తున్నాయి. వచ్చే కొత్త ఉద్యోగాల్లో 28 శాతం టెక్నాలజీ నేపధ్యం ఉన్నవే. స్టార్టప్ కంపెనీల భవిష్యత్ ఆశావాహంగా కనిపించడానికి ప్రభుత్వ విధానాలు కూడా దోహదంగా మారుతున్నాయి. 'స్టార్టప్ ఇండియా-స్టాండప్ ఇండియా' నినాదంతో కేంద్రం ఆంట్రపెన్యూర్లకు, ఇన్వెస్టర్లకు ప్రొత్సాహం ఇస్తోంది. ప్రస్తుత రాజకీయ - వ్యాపార పరిస్థితులు గతంతో పోలిస్తే 76 శాతం మెరుగ్గా ఉన్నాయని 65 శాతం కంపెనీలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇదే ప్రొత్సాహకర పరిస్థితి ఉంటుందని కంపెనీలు నమ్ముతున్నట్లు ఇన్నోవేన్ స్టడీలో వెల్లడయింది.
మరోవైపు కొత్తగా పుట్టుకొస్తున్న ఈ సంస్థల్లో ఎన్ని బతికిబట్టకడుతున్నాయన్న అనుమానం కలగొచ్చు. కానీ... వీటిలో సక్సెస్ శాతం ఎక్కువగా ఉందని తేలింది. సొంత సొమ్ముతో ప్రారంభిస్తున్న స్టార్టప్ లలో యాభై శాతం, ఫండింగ్ కంపెనీలు ప్రమోట్ చేస్తున్న స్టార్టప్ లలో 45 శాతం లాభాలు నమోదు చేసుకుంటున్నాయి. అయితే వెంచక్ క్యాపిటల్ ఫండెడ్ కంపెనీల్లో ప్రాఫిటబుల్ వెంచర్ల శాతం 22 శాతం మాత్రమే ఉందట.