ఈ ఏడాది రిపబ్లిక్ డే రోజు .. రైతులు కిసాన్ పరేడ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో పలు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రైతులు నిర్దేశించిన మార్గంలో కాకుండా చారిత్రక ఎర్రకోటను రైతులు ముట్టడించారు. అయితే, దీని వెనక ప్రముఖ పంజాబీ నటుడు దీప్ సిద్దు హస్తమున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రైతులను నిర్దేశించిన మార్గాల్లో కాకుండా ఎర్రకోట వైపు తీసుకెళ్లారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు విచారణ కొనసాగుతోంది.
ప్రస్తుతం పరారీలో ఉన్న నటుడు దీప్ సిద్ధూ మరో ముగ్గురు నిందితుల గురించి ఆచూకీ చెప్పిన వారికి ఢిల్లీ పోలీసులు నగదు బహుమతి ప్రకటించారు. సిద్ధూతో పాటు మరో ముగ్గురిపై కూడా పోలీసులు రివార్డు ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై సిక్కు జెండాను ఎగురవేసేందుకు సిద్ధూ మిగతా వారిని ప్రేరేపించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు సిద్ధూ ఆచూకీ లభించలేదు. సిద్దూతో పాటు జెండా ఎగురవేసిన జుగ్ రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్, గుర్జంత్ సింగ్‌పై రూ. లక్ష రివార్డు ప్రకటించారు. ఇంకో నలుగురు జాజ్బిర్ సింగ్, బూటా సింగ్, సుఖ్ దేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్ పై రూ. 50 వేల రివార్డు ప్రకటించారు. రిపబ్లిక్ డే రోజు ఢిల్లీలో అల్లర్ల తర్వాతి నుంచి వీరందరూ కూడా పరారీ లో ఉన్నారు.
ఈ ఘటనలో పలువుర్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, జనవరి 26 ముందు రోజు రాత్రి దీప్ సిద్ధూ రొచ్చగొట్టే ప్రసంగాలు చేశాడని.. ఆయన వల్లే ఎర్రకోటను ఆందోళనకారులు ముట్టడించారని రైతులు ఆరోపించారు. మరోవైపు, రైతులు చేస్తున్న ఆరోపణలను దీప్ సిద్ధూ కొట్టిపారేశారు. అంతేకాదు, తాను వారి గురించి నోరు విప్పితే తలలు ఎక్కడ పెట్టుకుంటారో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్న యువకుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోగా.. రైతులు, పోలీసులు పలువురు గాయపడ్డారు. చరిత్రాత్మక ఎర్రకోటను రైతులు ముట్టడించి, త్రివర్ణ పతాకం, రైతు జెండాలను ఎగురవేశారు.