ఆ స్టూడెంట్ కి ఏడాదికి 127కోట్ల గూగుల్ ఆఫర్

Update: 2015-11-20 09:22 GMT
మరో భారీ జీతాన్ని ప్రకటించింది గూగుల్. ఇంకా కాలేజీ చదువు పూర్తి కాని ఒక విద్యార్థి తమ కంపెనీలో కానీ చేరితే ప్రపంచ ప్రఖ్యాత సెర్చింజన్ గూగుల్ ఆఫర్ చేసిన వార్షిక జీతం ఎంతో తెలుసా? అక్షరాల రూ.1.27కోట్లు. ఢిల్లీ టెక్నాలజీ వర్సిటీకి చెందిన చేతన్ కక్కర్ కు గూగుల్ ఈ భారీ ఆఫర్ ఇచ్చింది.

ఢిల్లీకి చెందిన చేతన్.. ఐటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతగాడికి గూగుల్ భారీ ఆఫర్ ఇవ్వటంతో వెంటనే ఓకే చెప్పేశాడు. దీంతో.. తన కోర్సు పూర్తి చేసిన తర్వాత చేతన్.. అమెరికాలోని కాలిఫోర్నియాలోని గూగుల్ ఆఫీసులో ఉద్యోగంలో చేరనున్నాడు. తాజాగా అతనికి ఆఫర్ చేసిన ప్యాకేజీ ఢిల్లీ వర్సిటీ నుంచి అందుకున్న అతి పెద్ద ప్యాకేజీగా చెబుతున్నారు.

చేతన్ తల్లిదండ్రులు ఢిల్లీ వర్సిటీలో అధ్యాపకులుగా పని చేస్తున్నారు. చేతన్ తండ్రి సుభాష్ మేనేజ్ మెంట్ స్టడీస్ విభాగంలో పని చేస్తుంటే.. తల్లి రీతా కెమిస్ట్రీ విభాగంలో పని చేస్తున్నారు. తనకు ఇచ్చిన భారీ ఫ్యాకేజీతో అనందోత్సాహాల్లో ఉన్న చేతన్.. గూగుల్ లో పని చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.
Tags:    

Similar News