ఉందిలే మంచి కాలం ముందు ముందునా......తెలంగాణలో రాజకీయ నాయకులందరూ ఇదే పాట పాడుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులతో పాటు మహాకూటమిలోని టిక్కెట్లు ఆశిస్తున్న వారు కూడా ఈ పాటనే పాడుకుంటున్నారు. ముందస్తు ఎన్నికలలో ప్రతి నియోజకవర్గం నుంచి గెలిచేది ఒక్కరే కదా! మరి పోటీ చేసే అభ్యర్దులంతా తమకు తామే గెలుస్తామని ఎందుకు ధీమాగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఎన్నికలలో గెలుపు కాదు ఎవరికి వారు చేయించుకుంటున్న సర్వేలలో వస్తున్న విజయం.
తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే పలుమార్లు సర్వేలను చేయించింది. ఆ ఫలితాల ఆధారంగానే అభ్యర్దులనూ ఎంపిక చేసింది. అయితే ఈ అభ్యర్దులకు ఎవ్వరికీ సర్వేలో వారి పరిస్థితి మాత్రం చెప్పలేదు. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్దులు సొంత సర్వేలను చేయించుకుంటున్నారు. ఈ సర్వేలలో తాము ఎక్కడ బలంగా ఉన్నామో - ఎక్కడ బలహీన పడ్డాం వంటి అంశాలపై ద్రుష్టి పెడుతున్నారు. బలహీనంగా ఉన్న చోట తప్పులు సరిదిద్దే ప్రయత్నాలు ప్రారంభించారట. ఇంకా డబ్బులు తీసుకుని సర్వే చేసిన వారు తమ అభ్యర్ది కచ్చితంగా గెలుస్తాడని - అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయని నివేదికలు ఇస్తున్నారని సమాచారం.
ఇక మహాకూటమిలోని కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలకు చెందని అభ్యర్దులు కూడా తమ సొంత సర్వేలపై ఆధారపడుతున్నారు. కచ్చితంగా తనుకు టిక్కెట్టు వస్తుందని అనుకుంటున్న నాయకులు వ్యక్తిగత సర్వే చేయించుకుంటున్నట్లు సమాచారం. ఈ సర్వేలలో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉంది - సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజలలో ఎటువంటి అభిప్రాయం ఉంది వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. ఇక్కడ కూడా సర్వే చేసిన వారు అభ్యర్దులకు ఒకటి రెండు సూచనలు చేసి గెలుపు మీదే నని నివేదిక లు ఇస్తున్నట్లు సమాచారం. దీంతో మహాకూటమి అభ్యర్దులు కూడా తామూ విజయం సాధించినట్లేనని దీమాగా ఉన్నారట. అసలు విజయం సంగతి ఎలా ఉన్న ఈ సర్వే విజయం మాత్రం అభ్యర్దులకు మంచి కిక్ ఇస్తోందంటున్నారు.