మాటలు ఎంత పవర్ ఫుల్ అన్న విషయాన్ని తాజాగా ప్రపంచానికి తన మాటలతో అందరికి అర్థమయ్యేలా చేశారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఆయన మాటల పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా రేగుతున్న కలకలం అంతాఇంతా కాదు. జాతివివక్షను పెంచేలా ఆయన మాటలు.. విధానాలు ఉండటం.. వాటిని వంట బట్టించుకుంటున్న కొందరు అమెరికన్లు జాత్యాంహాకారంతో దాడులకు పాల్పడటం తెలిసిందే.
ఈ తరహా దాడితో మనోడు శ్రీనివాస్ కూఛిబొట్ల ప్రాణాలు కోల్పోవటాన్ని మర్చిపోలేం. ఈ దారుణాన్ని మరవక ముందే మరికొందరు ప్రవాస భారతీయులపై దాడులు జరగటంతో భారతీయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇది సరిపోదన్నట్లుగా హెచ్ 1బీ వీసాలకు సంబంధించిన ట్రంప్ తీసుకోనున్న నిర్ణయంపైనా ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇంతకాలం హెచ్ 1బీ వీసాల మీద అమెరికాకు వెళ్లే వారు.. తమ జీవిత భాగస్వామ్యులకు సైతం ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా వర్క్ పర్మిట్ ను ఇచ్చేవారు. అయితే.. ఈ విధానంతో అమెరికన్లు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోతున్న వాదనను వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. ఇదిలా ఉంటే.. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అమెరికా పెళ్లికొడుకులకు డిమాండ్ తగ్గినట్లుగా తెలుస్తోంది.
అమెరికా వరుడికి తమ అమ్మాయిని ఇచ్చేందుకు ఆడపిల్లల తల్లిదండ్రులు అస్సలు ఇష్టపడటం లేదని.. ట్రంప్ ప్రభావం వారి మీద చాలా ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. అమెరికా కాకుండా వేరేదేశాల్లో ఉద్యొగం చేస్తున్న యువకుల్ని చూడాలంటూ పెళ్లికుమార్తె తల్లిదండ్రులు మ్యారేజ్ బ్యూరోలను కోరుతున్నట్లుగా తెలుస్తోంది. ట్రంప్ పవర్ లోకి వచ్చిన తర్వాత దాదాపు 25 శాతం మేర అమెరికా పెళ్లి కొడుకల ఎంక్వయిరీలలో తేడా వచ్చినట్లుగా చెబుతున్నారు. తాజా పరిణామం చూస్తే.. పెళ్లికొడుకుల ఉసురును ట్రంప్ పోసుకున్నట్లుగా కనిపించక మానదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/