తాజ్‌మ‌హ‌ల్‌, కుతుబ్ మినార్‌ల‌ను కూల్చేయండి: బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్‌

Update: 2023-04-07 12:00 GMT
దేశంలో బీజేపీ నేత‌లు రెచ్చిపోతున్నారు. హిందూత్వ అజెండాను అమ‌లు చేయాల‌ని.. ఇటీవ‌ల గుజ‌రాత్‌కు చెందిన ఒక ఎమ్మెల్యే వివాదాస్ప‌ద కామెంట్లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు మ‌రో ఎమ్మెల్యే మ‌రింత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో శాంతికి చిహ్న‌మైన‌, ప్ర‌పంచ వార‌స‌త్వ‌ క‌ట్ట‌డాల్లో ఒక‌టైన‌ తాజ్ మహల్, ముస్లింల ప‌విత్ర ప్రాంతం కుతుబ్ మినార్లను కూల్చి వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇటీవ‌ల కేంద్ర ప్ర‌భుత్వం ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి మొఘలుల చరిత్ర, ఆర్ ఎస్ ఎస్‌పై బ్యాన్‌, గాంధీ హ‌త్య వంటి పాఠాలు తొలగించిన విష‌యం తెలిసిందే. తాజాగా అస్సాంకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే తాజ్ మహల్, కుతుబ్ మినార్లను కూల్చి వేయాలని పిలుపునిచ్చారు.

ఆ ప్రాంతాల్లో ఆలయాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. మరియానీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రూప్ జ్యోతి కుర్మి ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజ్ మహల్, కుతుబ్ మినార్లు ఉన్న చోట ఆలయాలు నిర్మిస్తే తన ఏడాది వేతనాన్ని విరాళంగా ఇస్తానని కుర్మీ ప్రకటించడం గ‌మ‌నార్హం. ఇక‌, ఈ వ్యాఖ్య‌లు ఆయ‌న ఏకంగా అసెంబ్లీ ఆవరణలోనే చేయ‌డం మ‌రో విశేషం.  ఎన్సీఈఆర్టీ సిలబస్ నుంచి మొఘలుల చరిత్రను తొలగించడాన్ని  రూప్జ్యోతి కుర్మీ స్వాగతించారు. మొఘలుల కాలంలో నిర్మించిన కట్టడాలపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

లూటీలు, దొంగతనాలు చేసి సంపాదించిన డబ్బుతో తాజ్మహల్ను నిర్మించారని సంచలన ఆరోపణ లు చేశారు. షాజహాన్ ప్రేమ విషయంపైనా దర్యాప్తు చేయాలంటూ చెప్పుకొచ్చారు. రూప్జ్యోతి కుర్మీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఓ న్యాయవాది పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గువాహటిలోని లతాశీల్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ ఇచ్చారు. రూప్జ్యోతి కుర్మీ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యతిరేకమైనవని గువాహటి హైకోర్టు న్యాయవాది తైజుద్దీన్ అహ్మద్ అన్నారు.

ఇటీవలే ఎన్సీఈఆర్టీ సిలబస్లో పలు మార్పులు జరిగాయి. మొఘలుల చరిత్ర, గాంధీ హత్య, ఆరెస్సెస్పై బ్యాన్ వంటి పాఠ్యాంశాలను సిలబస్ నుంచి తొలగించారు. గుజరాత్ అల్లర్లు, హిందూ ముస్లిం ఐక్యతకు గాంధీ చేసిన కృషి, దాని వల్ల హిందూ అతివాదుల్లో వ్యతిరేకత వ్యక్తం కావడం వంటి పాఠాలను పుస్తకాల నుంచి తీసేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News