అమెరికా ..ప్రతి ఒక్కరి కల. చదువుకున్న ప్రతి ఒక్కరు అమెరికా వెళ్లి మంచి జాబ్ చేయాలనీ - ఎక్కువ సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ , అమెరికా వెళ్ళాలి అంటే అంత ఆషామాషీ ఏం కాదు. వీసా ప్రాసెస్ చాలా కఠినంగా ఉంటుంది. వాటిని దాటుకొని ముందుకు వెళ్లగలిగిన వారు అమెరికాలో కాలు మోపగలరు. ఇక ఒక్కసారి అమెరికాలో అడుగుపెడితే ..మళ్లీ తిరిగి రావాలని ఎవ్వరు అనుకోరు. ముఖ్యంగా అక్కడి డాలర్ల జీతానికి అలవాటు పడ్డ యువత. దీనితో చదువుకోవడానికి వీసా తీసుకోని అమెరికా వెళ్లిన చాలామంది యువత వీసా కాలం ముగిసినా కూడా అక్కడే ప్రభుత్వ అధికారులకి చిక్కకుండా ఉద్యోగం చేస్తుంటారు.
ఈ మద్యే అలాంటివారిని అమెరికా పోలీసులు చాలా చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న విషయం తెలిసింది. పేక్ యూనివర్సిటీ పెట్టి ..అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్న ఇతర దేశాల వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారికీ తగిన శిక్షలు విధించి .. వారి దేశాలకి పంపించేశారు. ఆలా తిరిగి వచ్చిన వారిలో ఇండియన్స్ కూడా భారీగానే ఉన్నారు. ఇక తాజాగా మరోసారి అగ్రరాజ్యం అమెరికా అక్రమంగా అమెరికాలో కి ప్రవేశించిన వారిని - వీసా కాలం పూర్తి అయినా కూడా అక్కడే ఉంటున్న 145మంది భారతీయుల్ని అమెరికా వెనక్కి పంపింది.
వీరంతా బుధవారం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. వీరితో పాటు మరికొంత మంది బంగ్లాదేశీయులు - శ్రీలంక వాసులు కూడా ఉన్నారు. గత కొన్నేళ్లుగా వీరంతా అక్రమ మార్గంలో అమెరికాకు చేరుకున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరికొంత మంది వీసా గడువు ముగిసినప్పటికీ.. అక్రమంగా అక్కడే నివసిస్తున్నట్లు తేల్చారు. గతంలోనూ అమెరికా ఇలాగే 117మంది భారతీయుల్ని వెనక్కి పంపింది.