బుల్లెట్ బండి పై రాలేను...బస్సెక్కి వస్తా : డిపో మేనేజర్ ట్వీట్ వైరల్
ఈ మధ్య సోషల్ మీడియా లో వైరల్ అయిన పాట ఏదైనా ఉందా అంటే అది .. నీ బుల్లెట్ బండెక్కి వచ్చేస్తా పా..డుగ్గు డుగ్గు డుగ్గు అనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఈ పాటకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖ సింగర్ మోహన భోగరాజు ఆలపించిన ఈ పాటను ఎంతో మంది రీక్రియేషన్ చేశారు. అద్భుతమైన స్టెప్పులేస్తూ ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లి సమయంలో పెళ్లి కూతుర్లు ఈ పాట కి స్టెప్పులు వేస్తూ వైరల్ గా మారుతున్నారు.
ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా హనుమ కొండ ఆర్టీసీ డిపో మేనేజర్ బుల్లెట్ బండి పాటను ఉపయోగించుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానంటుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకు వీటి ధరలు పెరుగుతుండడంతో బైక్ ఎక్కేందుకు చాలామంది ఆలోచిస్తున్నారు. వీలైనంతవరకు బస్సులు, మెట్రో వంటి ప్రజారవాణా సౌకర్యాలనే వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించమని కోరుతూ ఇటీవల టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రిన్స్ మహేష్‌బాబుతో ఓ సెటైరికల్ పోస్ట్ షేర్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా వరంగల్ ఆర్టీసీ బస్ డిపో మేనేజర్ కూడా ఇలాగే ఓ పోస్ట్ పంచుకున్నాడు. బుల్లెట్ బండి పాట, పెట్రోల్ ధరలు, ఆర్టీసీ బస్సులు..ఇలా మూడింటికి ముడిపెడుతూ అతను షేర్ చేసిన ఈ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్ట్‌లో ఓ పెళ్లి కొడుకు ‘పెట్రోల్ రూ.120 అయ్యింది. నువ్వు కోరినట్లు డుగ్గు.. డుగ్గు.. డుగ్గు బుల్లెట్ బండిపై రాలేను. ఆర్టీసీ బస్సులోనే వస్తాను. నీకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకో’ అని పెళ్లికూతురుతో చెప్పినట్లు మీమ్‌ను క్రియేట్ చేశారు.దీని పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.