జ‌సిత్ గురించి జ‌గ‌న్ త‌ల్ల‌డిల్లేవార‌ట‌!

Update: 2019-07-28 13:03 GMT
నాలుగేళ్ల జ‌సిత్ కిడ్నాప్ కు గురి కావ‌టం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారు ఆ పిల్లాడు క్షేమంగా ఉండాల‌ని ప్రార్థించిన సంగ‌తి తెలిసిందే. సంచ‌ల‌నంగా మారిన ఈ కిడ్నాప్ ఉదంతంలో ప్ర‌తి తెలుగు కుటుంబం త‌మ ఇంట్లోనే ఆ ఉదంతం చోటు చేసుకున్న‌ట్లుగా ఫీలైన ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే..జ‌సిత్ కిడ్నాప్ వ్య‌వ‌హారంలో మీడియా.. పోలీసులు పోటీప‌డి మ‌రీ ప‌ని చేసిన‌ట్లుగా ప్ర‌శంసించారు ఏపీ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్. సంచ‌లనంగా మారిన జ‌సిత్ కిడ్నాప్ ఉదంతంలో నిందితులు ఎలాంటి వారైనా.. వారిని విడిచిపెట్టేదే లేద‌ని స్ప‌ష్టం చేశారు.

కేసుకు సంబంధించిన వివ‌రాల్ని బ‌య‌ట‌పెట్ట‌టం లేద‌న్న మాట‌కు.. వివ‌రాలు వెల్ల‌డించ‌టం ఇప్ప‌టిక‌ప్పుడు కుద‌ర‌ద‌ని..విచార‌ణ గోప్యంగా సాగుతుంద‌న్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పిల్లి ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు. జ‌సిత్ కిడ్నాప్ వ్య‌వ‌హారంపై సీఎం జ‌గ‌న్మోహ‌న్ త‌ర‌చూ ఆప్డేట్ ఏమిట‌ని అడిగేవార‌ని.. జ‌సిత్ కిడ్నాప్ ను ఛేదించాల్సిందిగా పోలీసుల‌తో ఆయ‌న స్వ‌యంగా చెప్పేవార‌న్నారు.

జ‌సిత్ కిడ్నాప్ వ్య‌వ‌హారం జ‌గ‌న్ ను సైతం క‌దిలించింద‌న్నారు. జ‌సిత్ కిడ్నాప్ చేసిన వారు త‌మ పార్టీకి చెందిన వారు అయిన‌ప్ప‌టికీ అలాంటి వారిని వ‌దులుకుంటామే త‌ప్పించి క్ష‌మించే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేయ‌టం గ‌మ‌నార్హం. ఒక చిన్నారి కిడ్నాప్ ఉదంతంలో సీఎం జ‌గ‌న్ త‌ల్ల‌డిల్లిన వైనం అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.
Tags:    

Similar News