రాజకీయాల్లో ఉన్న వారు ఆచి తూచి మాట్లాడాలి. ముఖ్యంగా కీలక పదవుల్లో ఉన్నవారు మరింత జాగ్రత్తగా మాట్లాడాలి. అది సభే అయినా.. పర్సనల్‌గా అయినా.. వారు మాట్లామే మాటలు ... కనుక.. ఏమాత్రం రేఖ దాటినా.. నేటి డిజిటల్ యుగంలో వారి వ్యాఖ్యలు వారికే బూమరాంగ్ అవుతాయి. గతంలో ఇలాంటి సంద ర్భాలు మనకు తెలిసిందే. అయితే.. తాజాగా.. ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలు. ఆసక్తిగా ఉన్నాయి. అయితే.. ఈ వ్యాఖ్యలను నెటిజన్లే తిప్పి కొడుతున్నారు. సదరు వ్యాఖ్యలను మంత్రిపైనే రువ్వుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ విషయం ఆసక్తిగా మారింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. కొన్నాళ్లుగా.. రాష్ట్రంలో ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య పీఆర్‌సీ విషయంలో చిచ్చు రేగింది. తమకు అమలు చేస్తున్న పీఆర్సీలో హెచ్ఆర్ ఏ తగ్గిపోవడంతోవేతనాల్లో కోతపడుతోందని .. పేర్కొంటూ.. ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వం చర్చలు జరిపినా.. ప్రయోజనం లేకుండా పోయింది. ఇక, ఈ క్రమంలోనే ఉపాధ్యాయులు కూడా ఆందోళన బాటలోకి వచ్చారు.. తమకు కూడా అన్యా యం చేస్తున్నారంటూ..వారు కూడా గళం వినిపించారు. ఈ క్రమంలో ఉపాధ్యాయులు కొందరు తమ ఆవేదనను మాటల రూపంలో కక్కేశారు.
సీఎంపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న మంత్రివర్గంలోని కొందరు.. ఇలా వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. సీఎంను తిడితే.. పీఆర్సీ పెరుగుతుందా? అని ప్రశ్నించారు. మంత్రి బొత్స, సలహాదారు సజ్జల వంటివారు ఈ విషయాన్ని తరచుగా ప్రశ్నిస్తున్నారు. ఇక, ఈ విషయం లో వేలు పెట్టిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి.. సీఎం జగన్‌పై ఉన్న అపార భక్తిని చాటుకున్నారు. సీఎంపై ఉపాధ్యాయులు, ఉద్యోగులు వాడిన భాష సరికాదన్నారు. ఉపాధ్యాఆయ వృత్తి అత్యంత పవిత్రమైందని.. చెప్పారు. సీఎం ను దూషించరాదని అన్నారు.
ఆయన ఇక్కడితో ఆగి ఉంటే.. వివాదం ఉండేది కాదు. ఈ క్రమంలోనే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు ఉపాధ్యాయులు.. లక్షలకు లక్షలు..జీతాలు తీసుకుంటూ.. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో ఎందుకు చదివించరని ప్రశ్నించారు. ప్రైవేటు స్కూళ్లలో ఎందుకు చదివిస్తున్నారని నిలదీశారు. మీరు చదువు చెప్పే బడుల్లోనే మీ పిల్లలను ఎందుకు జాయిన్ చేయరని నిలదీశారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు మంత్రికి బూమరాంగ్ మాదిరిగా తగులుతున్నాయి.
ఇది వాస్తవమే. అందరూ ఒప్పుకొంటారు. మరి అదేసమయంలో ప్రజాధనాన్ని లక్షలకు లక్షలు వేతనాలు.. ఇతర అలవెన్సుల రూపంలో తీసుకుంటున్న ఎమ్మెల్యేలు మాత్రం దీనికి అతీతమా? వారు మాత్రం ఎందుకు తమ పిల్లలనను ప్రైవేటు స్కూళ్లలో ను కాలేజీలలోను చేర్పిస్తున్నారు? వారు మాత్రం ఎందుకు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నారు? అని ఉపాధ్యాయ సంఘాల నేతలు నిలదీస్తున్నారు. మరి దీనికి మంత్రి ఏం సమాధానం చెబుతారో చూడాలి.