ఏపీలో హనుమాన్ విగ్రహం ధ్వంసం

Update: 2020-09-17 03:30 GMT
ఏపీలో అనుకోని సంఘటనలు కలవరపెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వరుసగా ఆలయాలపై వస్తున్న వార్తలు చర్చనీయాంశమవుతున్నాయి. కొన్ని రోజుల నుంచి వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇప్పటికే అంతర్వేది, పిడింగొయ్యి ఘటనలతో ఏపీ రాజకీయాల్లో వేడి పెరిగిపోయింది. ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. జగన్ పాలనలో ఇలా జరుగుతున్నాయని రాద్ధాంతం చేస్తున్నాయి. జగన్ సర్కార్ పై వ్యూహాత్మకంగా జరుగుతున్న ఈ దాడులను నిగ్గుతేల్చాలని కూడా వైసీపీ సర్కార్ పట్టుదలగా ఉంది.

ఈ క్రమంలోనే ఏపీలో హిందుత్వంపై మచ్చగా మరో దాడి జరిగింది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలోని శివాలయం దగ్గర ఉన్న శ్రీ సీతారామాంజనేయ వ్యాయమ కళాశాల వద్ద ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చేయిని గుర్తు తెలియని దుండగులు విరగొట్టారు.

ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఘటన స్థలంలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. విగ్రహాన్ని ధ్వంసం ఎవరు చేశారన్నది విచారణ జరుపుతున్నారు.
Tags:    

Similar News