మాజీ ప్రధాని ట్యాగ్ వేసుకుని నిత్యం వార్తల్లోకెక్కే దేవెగౌడ.. తన సొంత పార్టీ జేడీఎస్‌ను చక్కదిద్దలేని పరిస్థితి. అయితే రాహుల్‌గాంధీని ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగాలని సూచించినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా కర్ణాటక కాంగ్రెస్ నేతల నోళ్లు మూయించాలని ఫిర్యాదు చేశారు. సంకీర్ణ ప్రభుత్వం సజావుగా సాగాలంటే ఎవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని పిలుపునిచ్చారు. అంతేకానీ రాహుల్‌గాంధీ రాజకీయ ఎత్తుగడలు, ఎన్నికల్లో గెలుపోటములు, సంకీర్ణ ప్రభుత్వం గురించి చర్చించలేదని వివరించారు. గతంలో రాహుల్ కోసం ప్రధాని పదవి త్యాగం చేస్తున్నట్లు దేవెగౌడ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కర్ణాటకలోని జేడీఎస్ – కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. వచ్చే నాలుగేళ్ల పాటు అధికారంలో కొనసాగుతుంది. ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి కృషి చేస్తున్నారు. మధ్యంతర ఎన్నికలు అసెంబ్లీకి కాదు. స్థానిక సంస్థలకు సన్నద్ధం కావాలని మాత్రమే తాను పిలుపునిచ్చినట్లు మాజీ ప్రధాని, జేడీఎస్ జాతీయ నేత హెచ్‌డీ దేవెగౌడ స్పష్టం చేశారు. మధ్యంతర ఎన్నికలు అసెంబ్లీకి వస్తాయని తానెప్పుడూ చెప్పలేదని.. ఈ పెద్ద మనిషి చెప్పుకొచ్చారు. కానీ పురసభ, నగర సభ, పట్టణ పంచాయతీ తదితర స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చానని మాట మార్చారు. అయితే తన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని విమర్శించారు. కానీ ఆయన మనువడు, సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ ఇటీవల మండ్యలో మాట్లాడుతూ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని చెప్పిన ఆడియో టేపు వైరల్ అయిన సంగతి తెలిసిందే.
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ నేతలే ముందుకొచ్చారు. తాము ఎవ్వరూ కాంగ్రెస్‌ను కోరలేదని దేవెగౌడ తెలిపారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ నేతలే వ్యతిరేకించడం ఏంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఇటీవల కేబినెట్ విస్తరణ భాగంగా కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య సలహా మేరకే జేడీఎస్ కోటాలో ఒక స్వతంత్య్ర ఎమ్మెల్యేకు అవకాశం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వంలో కొనసాగవద్దని కాంగ్రెస్ నేతలు ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు రావడం విచిత్రంగా ఉందని దేవెగౌడ తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.
జేడీఎస్ రాష్ట్రాధ్యక్ష పదవికి తాను చేసిన రాజీనామాను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు. రాజీనామాను ఆమోదించకుంటే శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే హెచ్.విశ్వనాథ్ హెచ్చరించారు. రాజీనామాను ఉపసంహరించుకోవాలని దేవెగౌడ కోరినట్లు ఆయన తెలిపారు. అలాగే తన కుటుంబం ఎల్లప్పుడూ దేవెగౌడకు రుణపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని సీఎం కుమారస్వామి, మాజీ సీఎం సిద్ధరామయ్య వినియోగించుకోవడంలో విఫలమైనట్లు తెలిపారు.