తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకొనే ధోరణి ఉంటే మంచిదని, గిల్లి కజ్జాలు పెట్టుకోవడం వల్ల మన ప్రజలే నష్టపోతారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ముంపు మండలాలను తెలంగాణలో తిరిగి విలీనం చేయాలని కేసీఆర్ చేసిన ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఏపి నీటిపారుదల మంత్రి దేవినేని ఉమ తోసిపుచ్చారు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణకు ఇచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఆ మేరకు తెలంగాణ నుంచి తమకు ఎలాటి ప్రతిపాదన కూడా అందలేదన్నారు.
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ - తెలంగాణలోనూ ఓవైపు మంచినీరు, మరోవైపు చట్టబద్ధమైన సాగునీటి ప్రాజెక్టుల ఆయకట్టులకు చుక్కనీరు అందని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికంతటికీ కారణమైన మహారాష్ట్ర - కర్ణాటక ప్రభుత్వాలు అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు నిర్మాణాలను అడ్డుకునేందుకు తమతో చేయిచేయి కలపాల్సిందిగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఏ స్థాయిలోనూ ఎలాంటి అనుమతులు లేకుండా దాదాపు రూ.35వేల కోట్ల రూపాయల అంచనాలతో పాలమూరు - రంగారెడ్డి - దిండి ఎత్తిపోతల పథకాలను చేపట్టి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 130 టిఎంసిలను తరలించుకుపోవాలనే దురాలోచన ఏమాత్రం సరికాదంటూ హెచ్చరించారు. అన్నిరకాల అనుమతులతో ప్రధానంగా మిగులు జలాలు ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ అనుమతితో 227 టిఎంసిలను వినియోగించుకునేలా నిర్మాణంలో వున్న ప్రాజెక్టుల విషయాన్ని ముందుగా చూసుకుందామని సూచించారు. వీటిల్లో ప్రధానంగా తెలంగాణలో కల్వకుర్తి - నెట్టెంపాడు - ఆంధ్రాలో వెలుగొండ - హంద్రీ-నీవా - గాలేరు-నగరి - తెలుగు గంగ వంటి ప్రాజెక్టులు ఉన్నాయని మంత్రి దేవినేని ఉమ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ రాష్ట్రాలకు 812 టిఎంసిలు రావాల్సి ఉండగా ఇప్పటికి కేవలం 66 టిఎంసిలు మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టుకు రాగా స్థానిక ముఖ్య అవసరాల కోసం రెండు తెలుగు రాష్ట్రాలు 30 టిఎంసిల చొప్పున పంచుకోవాల్సిన గడ్డు పరిస్థితి వచ్చిందని ఆయనన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో రాని నీరు - లేని నీటి కోసం అనుమతులివ్వని ప్రాజెక్టులు చేపట్టటం తెలంగాణకు సరికాదని స్పష్టం చేశారు. ఈసందర్భంలో మనం సోదరభావంతో ఎగువ రాష్ట్రాల అక్రమాలను ఎదుర్కోవాల్సి ఉందని హితవు చెప్పారు. కృష్ణానదీ యాజమాన్య బోర్డును ఏదోలా ఒప్పించి ఒకసారి రెండు టిఎంసిలు తమకొస్తే సాగర్ ఎడమ కాల్వలో నల్గొండ కూడా దాటలేదన్నారు. రెండోసారి మరో రెండు టిఎంసిలు తీసుకొస్తే ఈసారి ఖమ్మం కూడా దాటి రాలేదని చెప్పారు. మూడోసారి కృష్ణానది బోర్డు మరో రెండు టిఎంసిలు ఇస్తే కృష్ణా జిల్లాలో ఐదారు చెరువులు కూడా నిండని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏదోవిధంగా కృష్ణా, సాగర్ ఆయకట్టు ప్రాంతాల్లోని లక్షలాది ఎకరాల భూములను కాపాడుకోవటమే కాకుండా మంచినీటి అవసరాలను తీర్చాల్సి ఉండగా కెసిఆర్ ఒంటెత్తు పోకడతో కొత్తగా ఎత్తిపోతల పథకాలను చేపడుతుంటంపై ఇప్పటికే ఈప్రాంత రైతులు సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశారని చెప్పారు.
దేవినేని ఉమా ఇచ్చిన ఘాటు రిప్లైని కేసీఆర్ ఊహించి ఉండరని రాజకీయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. నీటి వివాదాల విషయంలో దూకుడుగా ఉండాలనే ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లుందని విశ్లేషిస్తున్నారు.