మైల‌వ‌రంలో మార్పులు.. వారు వీరు.. వీరు వారు!!

Update: 2023-01-15 05:30 GMT
ఎన్టీఆర్ జిల్లాలోని మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇక్క‌డ అనూహ్యంగా రాజ‌కీ య ప‌రిణామాలు మారుతున్నాయ‌ని పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తుండ‌డంతో పాటు.. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకు విజ‌య‌వాడ ఎంపీ, టీడీపీ నాయ‌కుడు కేశినేని నాని మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం.. వంటివి రాత్రికి రాత్రి ఇక్క‌డి రాజ కీయాల‌ను వేడెక్కించాయి. దీంతో అస‌లు ఇక్క‌డ ఏం జ‌రుగుతోంద‌నేది ఆస‌క్తిగామారింది.

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన మాజీ మంత్రి దేవినేని ఉమాకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో నూజివీడు టికెట్ ఇస్తార‌ని ప్ర‌చా రం జ‌రుగుతోంది. అయితే.. ఇది అధికారిక‌మో.. కాదో తెలిసే లోగా.. దేవినేని మాత్రం మౌనంగా ఉన్నారు. ఆయ‌న ఇక్క‌డ కార్య‌క్ర‌మాల‌కు స‌గానికి స‌గం త‌గ్గించేసుకున్నారు. దీంతోపాటుపార్టీ కార్యాల‌యానికి కూడా రావ‌డం లేద‌ని అంటున్నారు. దీనిని బ‌ట్టి ఆయ‌న‌ను ఇక్క‌డ నుంచి బ‌దిలీ చేస్తున్నార‌నే చ‌ర్చ సాగుతోంది.

ఇదిలావుంటే.. కొన్నాళ్లుగా స్థానిక ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్రసాద్ వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. నేరు గా పార్టీని ఏమీ అన‌క‌పోయినా.. ఆయ‌న ప‌రోక్షంగా పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. గుంటూరు ఘ‌ట‌న‌లో అరెస్టును త‌ప్పుబ‌ట్టారు. దీనికి ముందు కూడా.. తాను ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేక పోతున్నాన‌ని అన్నారు. ఇప్ప‌టికే ఆయ‌న గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మానికి దూరంగా ఉన్నారు. ఇక‌, ఏడాది ముందు దేవినేని ఉమా.. వ‌సంత‌పై నిప్పులు చెరిగేవారు.

ఎక్క‌డ ఎలాంటి మీటింగ్ పెట్టినా.. వ‌సంత్ పై తీవ్ర విమ‌ర్శ‌లు చేసేవారు. ఇక వ‌సంత కూడా.. ఉమాపై నిప్పులు చెరిగేవారు. ఇలా.. ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు దూసుకున్న సంద‌ర్భాలు ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు.. ఎంపీ కేశినేని నాని.. వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ గుడ్ మ్యాన్ అంటూ.. స‌ర్టిఫికెట్ ఇచ్చారు. త‌న ఎంపీ నిధుల‌ను కూడా ఇచ్చాన‌ని.. చాలా చ‌క్క‌ని రాజ‌కీయ నాయ‌కుడు అని పొగిడారు. దీంతో మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వారు వీరు.. వీరు వారు అవుతున్నారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News