2024లో మైలవరం నుంచి పోటీకి దేవినేని ఉమా రెడీ అవుతున్నారు. కానీ ఈసారి ఆయనకు అక్కడ అంతా సానుకూలత కనిపించడంలేదు అంటున్నారు. సొంత పార్టీలోనే ప్రత్యర్ధులు తయారయ్యారు. పక్క నియోజకవర్గం నుంచి వచ్చిన దేవినేనిని రెండు సార్లు గెలిపించామని ఇక తాము ఆయనను మోయలేమని చెప్పేస్తున్నారు. లేటెస్ట్ గా క్రిష్ణా జిల్లా టీడీపీ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ బొమ్మసాని సుబ్బారావు అయితే డైరెక్ట్ అటాక్ చేశారు.
పెద్ద పాలేరు గా రెండు సార్లు దేవినేని ఉమాను గెలిపించానని, ఈసారి అసలు కుదరదని తేల్చి చెప్పేశారు. పక్క నియోజకవర్గం ఉమాదని, ఆయనకు ఇక్కడ సీటూ చోటూ ఎందుకని బొమ్మసాని లాజిక్ పాయింట్ తీస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి టికెట్ తనకే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. మైలవరం నుంచి తానే పోటీ చేస్తాను అంటూ ఆయన సౌండ్ చేశారన్న మాట.
తాను గత ఎన్నికల్లో ఉమా గెలుపు కోసం పనిచేశానని, ఆ విధంగా తాను ఈసారి పోటీ చేయాలని కోరుకోవడంలో ఎలాంటి తప్పూ పోరపాటు లేదని ఆయన అంటున్నారు. పైగా ఇది న్యాయం ధర్మమని చెబుతున్నారు. బొమ్మసాని సుబ్బారావుకు టీడీపీ నేతల నుంచి మద్దతు కూడా ఉందని అంటున్నారు. ఎందుకంటే ఆయనకు మైలవరంలో పట్టు ఉంది. ఇక దేవినేనికి ఎవరితోనూ పొసగడం లేదని అంటున్నారు.
అంతే కాదు, ఈసారి దేవినేని ఉమాకు టికెట్ ఇస్తే సొంత వారు సహకరించరని, పైగా ఆయన ఓడిపోతారని కూడా అంటున్నారు. ఇక అధినాయకత్వం తీరు చూసినా ఉమా జిల్లా పార్టీ నేతలతో మంత్రిగా ఉన్న టైం లో పెద్దగా రిలేషన్స్ పెంచుకోలేకపోయారని, ఇపుడు అవే దెబ్బ కొడుతున్నాయని అంటున్నారు. టీడీపీ అధినాయకత్వం కూడా దేవినేని ఉమాకు మైలవరం నుంచి తప్పించి వేరే సీటుని ఇవ్వాలని చూస్తోందని అంటున్నారు. అయితే దానికి ఉమా నో చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
క్రిష్ణా జిల్లాలో కీలకమైన సీటుగా మైలవరాన్ని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి 2009, 2014లలో దేవినేని ఉమా మహేశ్వరరావు గెలిచారు. ఆయన తెలుగుదేశం ప్రభుత్వంలో అయిదేళ్ళ పాటు కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. టీడీపీలో ముఖ్య నేతగా ఎదిగారు. దేవినేని క్రిష్ణా జిల్లా టీడీపీలో ధీటైన నాయకుడిగా ఉన్నారు. దేవినేని ఫ్యామిలీకి టీడీపీకి దశాబ్దాల బంధం.
ఇక దేవినేని వరకూ వస్తే ఆనాటి ఉమ్మడి ఏపీ విద్యా శాఖ మంత్రిగా ఉన్న దేవినేని వెంకటర రమణకు తమ్ముడిగా రాజకీయ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు. 1999లో హైదరాబాద్లో కాబినెట్ మీటింగ్ నుంచి గోదావరి రైలు లో విజయవాడకు వస్తున్న సమయంలో వరంగల్ జిల్లా కాజీపేట దగ్గర జరిగిన రైలు ప్రమాదంలో వెంకటర రమణ మరణించడం జరిగింది. ఆ నేపధ్యంలో ఉమాకు చాన్స్ వచ్చింది. అలా ఆయన రాజకీయాల్లో ప్రవేశించారు.
నందిగామ నుంచి 1999, 2004లలో వరసగా గెలిచిన దేవినేని ఉమా నందిగామ ఎస్సీ రిజర్వుడు కావడంతో మైలవరానికి షిఫ్ట్ అయ్యారు. అలా ఆయన పక్క నియోజకవర్గానికి మారి 2009, 2014లో రెండు సార్లు గెలిచారు. అయితే 2019లో ఆయన వైసీపీ వేవ్ లో వసంత క్రిష్ణ ప్రసాద్ చేతిలో ఓటమి పాలు అయ్యారు.
మరోసారి మైలవరం నుంచి పోటీకి దేవినేని ఉమా రెడీ అవుతున్నారు. ఇపుడు బొమ్మసాని రూపంలో అడ్డంకులు ఎదురవుతూండడంతోనే ఆయనకి బిగ్ షాక్ గా మారుతోంది. ఇప్పటికే సొంత నియోజకవర్గం నందిగామను వదిలేసి మైలవరానికి వచ్చిన ఉమా ఇపుడు అది కూడా కాకుండా వేరే చోటకు వెళ్తే పూర్తిగా రాజకీయంగా దెబ్బ తింటామని కలవరపడుతున్నట్లుగా చెబుతున్నారు.
ఏది ఏమైనా బొమ్మసాని సుబ్బారావు నోటి వెంట ఊరకనె ఈ మాటలు రావు అని ఆయనకు వెనక కావల్సినంత దన్ను ఉందని అంటున్నారు. మొత్తానికి మైలవరానికి ఉమా దూరం కాబోతున్నారు అన్నదే టీడీపీ వర్గీయుల మాట. మరి చివరి నిముషంలో దేవినేన్ ఉమా మ్యానేజ్ చేసి టికెట్ తెచ్చుకుంటారా అన్నదే చూడాల్సి ఉంది అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.