ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు అహర్నిషలు కృషి చేస్తున్నారు. అప్పటి వరకు ప్రత్యామ్నాయ మెడిసిన్ ఉపయోగించే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కరోనాతో బాధపడుతున్న రోగుల ప్రాణాలు కాపాడేందుకు చౌకగా అలాగే, విస్తృతంగా లభించే ఓ ఔషధం పని చేస్తోందని గుర్తించారు యూకే ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు. కరోనాపై పోరుకు తక్కువ మోతాదు డెక్సామెథాసోన్ పని చేస్తోందని గుర్తించారు. ఈ ఔషధంపై ట్రయల్స్ జరుగుతున్నాయి.
కరోనా కారణంగా వెంటిలెటర్ పైన ఉన్న రోగుల్లోని వ్యాధిని మూడొంతుల వరకు తగ్గించిందట. ఆక్సిజన్ పైన ఉన్న వారిలో ఐదొంతుల మరణాలను తగ్గించింది. యూకేలో కరోనా మహమ్మారి సోకిన వారికి దీనిని ఉపయోగించి దాదాపు 5,000 మంది ప్రాణాలు నిలబెట్టారని రీసెర్చ్‌లో తేలింది. కరోనా రోగులు అధిక సంఖ్యలో ఉన్న పేదదేశాలకు ఇది ఎంతో ప్రయోజనకారి అని చెబుతున్నారు. డెక్సామెథాసోన్ అర్థరైటిస్, అస్తమా చికిత్సకు వాడే స్టెరాయిడ్.
కరోనా రోగులుకు రోజుకు 6 మిల్లీ గ్రాముల చొప్పున పదిరోజులు ఇంజెక్షన్ రూపంలో లేదా మాత్రం రూపంలో ఇచ్చారు. మరికొంత మందికి దీనిని ఇవ్వలేదు. ఈ పరిశోధన లో వచ్చిన మార్పులను ఆధారంగా చేసుకొని డెక్సామెథాసోన్ పని చేస్తోందని ప్రాథమికం గా గుర్తించారు. యూకే 2,00,000 ఔషధ కోర్సులను కలిగి ఉంది. దీనిని పేషెంట్లకు అందుబాటు లో ఉంచుతున్నట్లు తెలిపింది. బ్రిటిష్ శాస్త్రవేత్తలు విజయం సాధించారని బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. ఇంగ్లాండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ.. ఈ ఔషధం ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలను కాపాడుతుందన్నారు.
20 మంది కరోనా రోగుల్లో 19 మంది ఈ మెడిసిన్ వల్ల ఆసుపత్రి లో చేరకుండానే కోలుకుంటారని చెబుతున్నారు. ఆసుపత్రి లో చేరిన వారిలో కొంతమంది ఆక్సిజన్ లేదా మెకానికల్ వెంటిలెటర్ పైన ఉంటారు. వీరు హైరిస్క్‌లో ఉన్న రోగులు. వీరికి డెక్సామెథాసోన్ ఉపయోగ పడవచ్చు.