వ్యవస్థలో ఇద్దరు కీలక వ్యక్తుల మధ్య సంవాదన లాంటి సంఘటన చోటుచేసుకోవటం ఆసక్తికర పరిణామమే. రాజకీయ వ్యవస్థకు.. పాలనా వ్యవస్థకుమధ్య ఘర్షణ లాంటి పరిస్థితి చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుంది. ఇక..తెలంగాణ రాష్ట్రం లాంటి రాష్ట్రంలో బలమైన ముఖ్యమంత్రి ఉన్న వేళఅధికారులు వాయిస్ బయటకు రాదన్న అభిప్రాయం ఉంటుంది. అందుకుభిన్నంగా ఏదైనా ఘటన చోటు చేసుకుంటే కాస్త ఆశ్చర్యకర పరిణామంగాపరిగణించాలి. తాజాగా అలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత రాష్ట్రంలో కీలక నేత ఎవరంటే..అందరూ ఎలాంటి ఆలోచన చేయకుండా చెప్పే పేరు మంత్రి కేటీఆర్. కేసీఆర్వారసుడిగా ఆయన్ను ఇప్పటికే గుర్తించటం తెలిసిందే. అలాంటి కేటీఆర్ ఏదైనావిషయం మీద ట్వీట్ చేస్తే స్పందన ఎలా ఉండాలి? ఏదైనా అంశం మీదమండిపాటును ప్రదర్శిస్తే.. వ్యవస్థ ఉరుకులు పరుగులు పెట్టేలా ఉండాలి.రియాక్షన్ అదిరిపోయేలా ఉండాలి. అయితే.. ఇలాంటివన్నీ ఉన్నా.. వీటితోపాటు.. మాటకు మాట అన్నట్లుగా ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అనే అంశంపై కేటీఆర్ రియాక్ట్ అయి.. డీజీపీకి ట్వీట్చేయటం.. ఆయన అంతే ధీటుగా సమాధానం చెబుతూ రీట్వీట్ చేయటం ఒకఎత్తు అయితే.. డీజీపీ చేసిన రీ ట్వీట్ కు ట్విట్టర్ లో సైబరాబాద్ తూర్పు సీపీకృతజ్ఞతలు చెబుతూ మరో ట్వీట్ చేయటం కనిపించింది. ఈ మొత్తం ఇష్యూ ఎలా మొదలైందన్న విషయాన్ని చూస్తే.. ఒక బైక్ ర్యాలీకి అనుమతి లేదంటూ మంచాల సీఐ దురుసుగా ప్రవర్తించటం.. ర్యాలీలో పాల్గొన్న వ్యక్తిపై సీఐ చేయి చేసుకోవటం జరిగింది. దీనిపై కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ లో ఈ వీడియోను పోస్ట్ చేశారు.
దీనిపై రియాక్ట్ అయిన మంత్రి కేటీఆర్.. ఇదేనా పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ అంటూ డీజీపీకి ట్వీట్ చేశారు. పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే ప్రభుత్వ నినాదానికి విరుద్ధంగా తాజా ఘటన ఉందని కేటీఆర్ పేర్కొంటూ.. ఈ ఇష్యూ మీద దృష్టి సారించాలన్నారు. దీనికి స్పందించిన డీజీపీ దురుసుగా వ్యవహరించిన మంచాల సీఐపై చర్యలు తీసుకున్నట్లుగా ప్రకటించారు. ఇక్కడి ఈ ఇష్యూ ముగిస్తే మరోలా ఉండేది. కానీ.. డీజీపీ అనురాగ్ శర్మ అలా చేయలేదు. మంచాల సీఐ మీద చర్యలు తీసుకున్నట్లుగా వెల్లడిస్తూనే.. బైక్ రేసింగ్ నిర్వహించిన వ్యక్తిపైనా.. దురుసుగా వ్యవహరించిన సీఐపై సైబరాబాద్ కమిషనర్ చర్యలు తీసుకున్నట్లుగా వెల్లడించారు. నిర్వాహకులు అనుమతి లేకుండా బైక్ రేసింగ్ నిర్వహించారని.. దురుసు వైఖరి వల్లే ఇలాంటి ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. ఎలాంటి రక్షణ.. భద్రతా చర్యలు చేపట్టకుండానే రేసింగ్ నిర్వహిస్తుండటంతో మంచాలపోలీస్ స్టేషన్ పరిధిలోభయానక పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. మరింత భయానక పరిస్థితి చోటు చేసుకుందని చెబుతూనే.. సీఐ దురుసుగా వ్యవహరించారంటూ చర్యలు తీసుకోవటం ఏమిటి? ప్రెండ్లీ పోలీసింగ్ ను ప్రశ్నించిన కేటీఆర్ కు ‘బైక్ రేసింగ్.. దురుసు ప్రవర్తన’ అంటూ ధీటుగా రీ ట్వీట్ చేసిన వైనం చూస్తే.. ఏం అర్థం కావాలో అది అర్థమయ్యేలా లేదు..?