తెలుగు రాష్ట్రం తెలంగాణాను గడగడలాడించిన డ్రగ్స్ భూతం ఇప్పుడు తమిళనాడుకు పాకింది. నిజానికి తెలంగాణలో నెలల పాటు డ్రగ్స్ భూతం కుదిపేసింది. ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందో ఎప్పుడు ఎవరిని విచారణకు రమ్మంటారో నని టాలీవుడ్ బెంబేలెత్తిపోయింది. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో మొదలు పెట్టి మాస్ మహారాజ్ రవితేజ వరకు దాదాపు 12 మంది ప్రముఖ హీరో హీరోయిన్లను సిట్ గంటల తరబడి ప్రశ్నించి సంచలనం సృష్టించింది. ఇక, ఇప్పటికీ ఇది తెలంగాణను విడిచి పెట్టలేదు. అయితే, తాజాగా తమిళనాడులోనూ డ్రగ్స్ ఛాయలు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
నిజానికి సంప్రదాయాలకు, సంస్కృతికి పెద్ద పీట వేసే తమిళనాడులో డ్రగ్స్ అంటే అందరూ నివ్వెరపోతున్నారు. అంతేకాదు, ఈ డ్రగ్స్‌తో సంబంధాలున్నాయని పేర్కొంటూ అధికార అన్నాడీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నేతను అరెస్టు చేయడం మరింత సంచలనానికి దారితీసింది. విషయంలోకి వెళ్తే.. మత్తు పదార్థాలను విక్రయించిన కేసులో అన్నాడీఎంకే ప్రముఖ నేత ధనశేఖరన్ ను పోలీసులు అరెస్టు చేశారు. నార్త్ చెన్నై ప్రాంతాల్లో నిషేధం విధించబడిన మాదక ద్రవ్యాలను విక్రయించిన వారిని అరెస్టు చేయాలని పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
దాని ప్రకారం వాషర్ మెన్ పేట సహాయ కమిషనర్ నేతృత్వంలో తండయారుపేట - వాషర్ మెన్ పేట - కొరుక్కుపేట - రాయపురం - కాశిమేడు తదితర ప్రాంతాల్లో ప్రత్యేక బృందం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కొరుక్కుపేట కామరాజర్ నగర్ కు చెందిన ధనశేఖరన్(40) వద్ద సుమారు రూ.1.50 లక్షల విలువైన 300 కిలోల జర్దా - 50 కిలోల మావాలను పోలీసులు గుర్తించారు. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని ధనశేఖరన్ ను అరెస్టు చేశారు. మత్తు పదార్ధాలు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరికి విక్రయించారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వాస్తవానికి ధనశేఖరన్.. అన్నాడీఎంకే టీటీవీ దినకరన్ వర్గంలో కీలక నేతగా ఉన్నారు. అంతకుముందు ఆయన విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే పార్టీలో పనిచేశారు. తర్వాత డీఎండీకే పార్టీని వదిలి అన్నాడీఎంకేలోకి వచ్చారు. ఇప్పుడు ఈయన మత్తు పదార్థాల వ్యాపారంలో ఆరితేరినట్టు అధికారులు గుర్తించారు. మరి ఈ కోవలో ఇంకెంత మంది బయటకు వస్తారో చూడాలి.